ఇరాన్, గల్ఫ్ దేశాల్లో ఉన్న తెలుగు వారు అప్రమత్తంగా ఉండాలి: సీఎం రేవంత్
- March 01, 2026
హైదరాబాద్: ఇజ్రాయెల్, ఇరాన్ దేశాల మధ్య భీకర దాడులతో పశ్చిమాసియాలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో ఇరాన్‌తో పాటు గల్ఫ్ ప్రాంతాల్లో ఉన్న తెలుగు ప్రజలందరూ అత్యంత అప్రమత్తంగా ఉండాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సూచించారు. ఆ ప్రాంతాల్లో యుద్ధ వాతావరణం కొనసాగుతున్నట్లు వస్తున్న వార్తల దృష్ట్యా అక్కడి తెలంగాణ వాసులు తప్పనిసరిగా భద్రతా మార్గదర్శకాలను పాటించాలని కోరారు. ఆయా దేశాల్లో ఉన్న భారత రాయబార కార్యాలయాలు ఎప్పటికప్పుడు జారీ చేసే సూచనలు, అధికారిక హెచ్చరికలను తుచ తప్పకుండా పాటించాలని స్పష్టం చేశారు.
అత్యవసర పరిస్థితులు ఎదురైతే తెలుగు ప్రజలను స్వరాష్ట్రానికి సురక్షితంగా రప్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలా సిద్ధంగా ఉందని, ఇందుకోసం కేంద్ర ప్రభుత్వంతో ఎప్పటికప్పుడు సమన్వయం చేసుకుంటున్నామని సీఎం భరోసా ఇచ్చారు. ప్రాణాపాయం లేకుండా అందరూ సురక్షిత ప్రాంతాల్లో ఉండాలని, పరిస్థితులు చక్కబడే వరకు అనవసర ప్రయాణాలు పెట్టుకోవద్దని ఆయన విజ్ఞప్తి చేశారు.
తాజా వార్తలు
- యూఏఈలో పిల్లలకు ఫ్లూ హెచ్చరికలు.. స్కూల్‌కు పంపొద్దని సూచన..!!
- కార్మికుల రిక్రూట్మెంట్ పై వార్న్..SR100,000 వరకు ఫైన్..!!
- ఒమన్‌లో సరికొత్త వ్యవసాయ పరిశోధనలు..!!
- బహ్రెయిన్‌లో వీడియో హెల్త్ సర్వీసులు విస్తరణ..!!
- కువైట్‌లో సీ ట్యాక్సీ, సముద్ర మార్గంలో డెలివరీలు..!!
- ప్రయాణికులు, విమానాల భద్రతకే అత్యధిక ప్రాధాన్యం..!!
- Asian Games 2026: మహిళల క్రికెట్లో భారత్‌కు తొలి స్వర్ణం!
- దుబాయ్-అబుదాబి రైలు టికెట్ల విక్రయాలు ప్రారంభం.. సెప్టెంబర్ 30 నుంచి సేవలు
- తీవ్ర ఒత్తిడిలో ప్రపంచం..విదేశాంగ మంత్రి జైశంకర్ ఆవేదన
- ఇరాన్ కు అమెరికా మరో వార్నింగ్







