సౌదీలో డొమెస్టిక్ వర్కర్ల బదిలీకి కొత్త సర్వీస్..!!
- August 06, 2026
రియాద్: సౌదీ అరేబియా మానవ వనరులు, సామాజిక అభివృద్ధి మంత్రిత్వ శాఖ (MHRSD) కీలక నిర్ణయం తీసుకుంది. ప్రైవేట్ రంగ సంస్థల్లో పనిచేస్తున్న విదేశీ కార్మికులను వ్యక్తిగత స్పాన్సర్ (Individuals) వద్ద గృహ కార్మికులుగా బదిలీ చేసుకునేందుకు కొత్త ఆన్‌లైన్ సేవను ప్రారంభించింది. ఈ సేవ ద్వారా నిర్దిష్ట నిబంధనలు, అర్హతలు పూర్తి చేసిన విదేశీ ఉద్యోగుల సేవలను ప్రైవేట్ సంస్థల నుంచి వ్యక్తిగత యజమానుల వద్దకు బదిలీ చేయవచ్చు. గృహ వృత్తులకు సంబంధించిన ఉద్యోగాలకే ఈ సౌకర్యం వర్తిస్తుందని మంత్రిత్వ శాఖ వెల్లడించింది.
ఈ బదిలీకి విదేశీ కార్మికుడి వర్క్ పర్మిట్ చెల్లుబాటులో ఉండాలి. అలాగే విద్య, సాంకేతిక, వైద్య, నిపుణుల ఉద్యోగాలు, పూర్తిగా సౌదీకరణ (Saudization) అమల్లో ఉన్న వృత్తులకు చెందిన ఉద్యోగులను ఈ విధానంలో బదిలీ చేయడానికి అనుమతి ఉండదు. దరఖాస్తుదారు గత యజమాని నుంచి ఛాంబర్ ఆఫ్ కామర్స్ ధ్రువీకరించిన ఎలక్ట్రానిక్ నో అబ్జెక్షన్ (వేవర్) పత్రాన్ని సమర్పించాలి. కొత్త యజమాని వేతన ధ్రువీకరణ పత్రం లేదా ఆర్థిక సామర్థ్యాన్ని నిరూపించే బ్యాంక్ స్టేట్‌మెంట్‌ను కూడా జతచేయాలి. విదేశీ కార్మికుడి వేలిముద్ర, సంతకం ఉన్న ఇకామా (రెసిడెన్సీ పర్మిట్) ప్రతిని సమర్పించాల్సి ఉంటుంది. అలాగే బదిలీ చేయబోయే వృత్తి వివరాలతో పాటు కొత్త యజమాని పేరు, జాతీయ గుర్తింపు సంఖ్య (నేషనల్ ఐడీ)ను కూడా దరఖాస్తులో పేర్కొనాలి.
ఇదే సమయంలో గృహ కార్మికుల కోసం వేతన రక్షణ కార్యక్రమం (Wage Protection Program)ను తప్పనిసరిగా అమలు చేస్తున్నట్లు మంత్రిత్వ శాఖ తెలిపింది. ఈ విధానం ద్వారా వేతనాలు అధికారిక మార్గాల్లో చెల్లించడం, యజమాని-ఉద్యోగి హక్కుల పరిరక్షణ, కార్మిక వ్యవస్థలో పారదర్శకత పెంపొందించడం లక్ష్యంగా పెట్టుకున్నట్లు పేర్కొంది.
కాగా, సౌదీ పౌరులు నలుగురికి మించి, నివాసితులు ఇద్దరికి మించి అదనపు వర్కర్లను నియమించుకుంటే ప్రతి అదనపు కార్మికుడికి సంవత్సరానికి 9,600 సౌదీ రియాల్స్ ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. అయితే దివ్యాంగులు, దీర్ఘకాలిక లేదా తీవ్రమైన అనారోగ్యంతో బాధపడుతున్న వారికి మానవతా ప్రాతిపదికన మినహాయింపులు ఉంటాయని మంత్రిత్వ శాఖ వెల్లడించింది.
తాజా వార్తలు
- ఇరాన్ పై ట్రంప్ తీవ్ర హెచ్చరిక.. ఒప్పందం కుదరకపోతే ‘అంతం చేస్తా’
- రక్షణ, ఏరోస్పేస్ పరిశోధనలకు ఊతం.. బిట్స్ పిలానీ, DIAT మధ్య 20 అవగాహన ఒప్పందాలు
- ‘వందేమాతరం’ వివాదం..డీకే శివకుమార్ ప్రభుత్వానికి గవర్నర్ హెచ్చరిక
- కల్బాలో అల్ ఫ్రైష్ సరస్సు ప్రాజెక్టుకు షార్జా రూలర్ ఆమోదం
- హైదరాబాద్‌లో భారీ వర్షం..కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్
- 72వ జాతీయ చలనచిత్ర అవార్డుల్లో తెలుగు సినిమాకు ఘన గౌరవం
- మారిషస్ రాష్ట్రపతి చేతుల మీదుగా డా.గజల్ శ్రీనివాస్ ‘శ్రీమద్భగవద్గీత’ ఆల్బమ్ ఆవిష్కరణ
- ఎట్టకేలకు ఏపీలో నంది అవార్డులు..
- షేక్ అహ్మద్‌కు అంతిమ ప్రార్థనలు.. హాజరైన షేక్ మహమ్మద్, పలువురు రాజకుటుంబ సభ్యులు
- రాస్ అల్ ఖైమా రూలర్ ని కలిసిన భారత కాన్సుల్ జనరల్ డాక్టర్ విష్ణువర్ధన్ రెడ్డి







