అన్ని శాఖల్లో ఎఐ వినియోగం పై సీఎం చంద్రబాబు సమీక్ష

- March 03, 2026 , by Maagulf
అన్ని శాఖల్లో ఎఐ వినియోగం పై సీఎం చంద్రబాబు సమీక్ష

అమరావతి: అన్ని ప్రభుత్వ శాఖల్లో కృతిమ మేధ (ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్) వినియోగించుకోవడం ద్వారా పాలనలో సమర్ధత మరింత పెంచుకోవాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులకు సూచించారు. ఆర్టీజీఎస్, పబ్లిక్ పాజిటివ్ పర్షెప్సన్ పై క్యాంపు కార్యాలయంలో అధికారులతో సోమవారం సమీక్ష నిర్వహించిన ముఖ్యమంత్రి… వివిధ అంశాలపై చర్చించారు. డ్రోన్, సీసీ టీవీ కెమేరాలు, శాటిలైట్ సమాచారాన్ని సమీకృతం చేసి, వినియోగించుకునేలా ఒక మెకానిజం తీసుకురావాలని అధికారులకు ముఖ్యమంత్రి చెప్పారు. ప్రజలకు ఉత్తమ సేవలు అందించేందుకు, పనితీరు మెరుగు పరుచుకునేందుకు అధికారులు తప్పనిసరిగా క్షేత్రస్థాయిలో పర్యటించాలని ఆదేశించారు.

రాష్ట్రంలో వరుసగా జరుగుతున్న ప్రమాదాలు, సంఘటనలపై అప్రమత్తంగా ఉండాలని, ముందస్తు జాగ్రత చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. బాణసంచా తయారీ కేంద్రాల్లో పేలుడు ఘటనలు పునరావృతం కాకుండా రక్షణ చర్యలపై తమిళనాడులోని శివకాశీకి వెళ్లి అధ్యయనం చేయాలని సీఎం స్పష్టం చేశారు. బాణసంచా పేలుడు ఘటనలు పునరావృతం కాకుండా రక్షణ చర్యలపై శివకాశీకి వెళ్లి అధ్యయనం చేయాలని సీఎం ఆదేశించారు. రాష్ట్రంలో వరుస ప్రమాదాలు, సంఘటనలపై అప్రమత్తంగా ఉండాలి, ముందస్తు జాగ్రత చర్యలు తీసుకోవాలన్నారు.

రానున్న వేసవిని దృష్టిలో పెట్టుకుని ఆర్టీసీ బస్ స్టేషన్లలో మంచినీటికి ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బంది తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని చెప్పారు. బస్ స్టేషన్కు వచ్చిన దగ్గర నుంచి గమ్యస్థానం చేరే వరకు ప్రయాణం సౌకర్యవంతంగా జరిగేలా పరిస్థితులు ఉండాలన్నారు. ఆర్టీసీ బస్సు సర్వీసులు బావున్నా… ఆర్టీసీ బస్ స్టేషన్లో సౌకర్యాలు, ఔట్ సోర్సింగ్ సర్వీసులు మెరుగ్గా ఉండేలా చర్యలు చేపట్టాలి అన్నారు. పుంగనూరు, వెంకటగిరి, పెనుకొండ, ప్రొద్దుటూరు, ఎమ్మిగనూరు, శ్రీకాళహస్తి బస్ స్టేషన్లో తాగునీరు, టాయిలెట్స్, ఫ్యాన్స్, సీటింగ్ ఏరియాపై ప్రయాణికుల నుంచి అసంతృప్తి.. మొత్తం రాష్ట్రంలోని అన్ని బస్టేషన్లో టాయిలెట్స్ మరమ్మతులు పూర్తి చేయాలని సీఎం ఆదేశించారు. బస్ స్టేషన్కు వచ్చిన దగ్గర నుంచి గమ్యస్థానం చేరే వరకు ప్రయాణం సౌకర్యవంతంగా ఉండాలి.

రిజిస్ట్రేషన్ శాఖలో స్లాట్ బుకింగ్, డిజిటల్ సేవలు, సిబ్బంది ప్రవర్తనపై సంతృప్తి వ్యక్తమైందని వివరించిన అధికారులు, అవినీతికి తావులేకుండా రాష్ట్రంలోని మొత్తం 295 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో నిజాయితీ కలిగిన అధికారులకే అవకాశం ఇవ్వాలని చెప్పిన సీఎం అటు పెన్షన్ల పంపిణీలో ఎలాంటి లోటుపాట్లు జరగకుండా అట్టడుగు స్థానంలో ఉన్న స్వర్ణ గ్రామాలు, స్వర్ణ వార్డులపై ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు. అలాగే, ప్రభుత్వం దగ్గరున్న సమాచారం కాకుండా, అదనపు సమాచారం కోసం మాత్రమే ఇకపై సర్వేలు జరపాలి తప్ప, పదేపదే ఒకేరకమైన సమాచారం కోసం ప్రజలను, ప్రభుత్వ సిబ్బందిని ఇబ్బంది పెట్టవద్దని అధికారులకు ముఖ్యమంత్రి స్పష్టమైన ఆదేశాలు జారీచేశారు.

మరోవైపు రాష్ట్రంలో వాట్సప్ మనమిత్ర సేవలను మరింత విస్తృతం చేసినట్టు అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. తల్లికి వందనం కింద ఏడాదికి రూ.10,090 కోట్లు 67 లక్షల మంది విద్యార్థుల తల్లుల ఖాతాలో జమ చేస్తున్నాం. ఆడబిడ్డలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కోసం స్త్రీ శక్తి పథకం తీసుకువచ్చాం. దీపం పథకం కింద ఏడాదికి మూడు గ్యాస్ సిలిండర్ల ఉచితంగా అందిస్తున్నాం. వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా పౌరుల వద్దకే ప్రభుత్వ సేవలు అందేలా చర్యలు తీసుకుంటున్నాం. సంజీవని కార్యక్రమం ద్వారా ఐదు కోట్ల ప్రజల ఆరోగ్యానికి భరోసా కల్పిస్తున్నాం. పేదరికం లేని రాష్ట్రం లక్ష ముందుకు వెళుతున్నామని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు.

ఆడబిడ్డలతో తెలుగుదేశం పార్టీ అనుబంధం ఈ నాటికి కాదు. ఆనాడు ఎన్టీఆర్ మగవారితో సమానంగా మహిళలకు ఆస్తిహక్కు కల్పించారు. మహిళల కోసం తిరుపతిలో పద్మావతీ యూనివర్సిటీ ఏర్పాటు చేశారు. నేను ముఖ్యమంత్రి అయ్యాక డ్వాక్రా సంఘాల ద్వారా మహిళకు ఆర్థిక భరోసా కల్పించాను. రాష్ట్రంలో ద్వారా సంఘాల్లో 89 లక్షలమంది, మెప్మా సంఘాల్లో 24 లక్షల మంది సభ్యులున్నారు. తీసుకున్న రుణాలు సకాలంలో చెల్లిస్తే బ్యాంకులు మరిన్ని రుణాలు ఇస్తాయని నేను చెప్పిన మాటను పొదుపు మహిళలు తూచా తప్పకుండా పాటించి ఆర్ధిక ప్రగతి సాధించారు. 2024-25లో రూ. 46 వేల 590 కోట్ల రూపాయి బ్యాంకుల నుంచి రుణాలు తీసుకున్నారు.

నేనిచ్చిన ఐటీ పిలుపుతో ఎంతోమంది దేశ విదేశాల్లో ఆర్థికంగా ఉన్నతంగా స్థిరపడ్డారు. ఇంటికో పారిశ్రామిక వేత్తను తయారు చేయాలని లక్ష్యం పెట్టుకున్నాం. ఇప్పటికే 93 వేలమంది మైక్రో, ఎంఎస్ ఎంఈ ఎంట్రప్రెన్యూర్లు అయ్యారు. ద్వాక్రా మహిళలు విదేశాలు కూడా వెళ్లి ఎంతోమందికి ట్రైనింగ్ ఇచ్చారు. ద్వాక్రా సంఘాలను మరింత సమర్థవంతంగా తయారుచేసే భాద్యత తనదేనని అన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com