అన్ని ఎంట్రీ వీసాలను ఒక నెల పాటు పొడిగించిన ఖతార్..!!
- March 03, 2026
దోహా: ఎయిర్ స్పేస్ మూసివేతతో చిక్కుకుపోయిన వారికి ఖతార్ ఊరటనిచ్చే నిర్ణయం తీసుకుంది.గడువు ముగిసిన లేదా గడువు ముగియబోతున్న అన్ని కేటగిరీల ఎంట్రీ వీసాలను ఒక నెల పాటు పొడిగించినట్లు ఖతార్ అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రకటించింది. ఆమోదించబడిన ఎలక్ట్రానిక్ సిస్టమ్‌ల ద్వారా పొడిగింపు ఆటోమెటిక్ గా ప్రాసెస్ అవుతుందని తెలిపింది. అలాగే, దరఖాస్తు ఫీజులకు మినహాయింపు ఇచ్చినట్లు మంత్రిత్వ శాఖ వెల్లడించింది. అలాగే, ఫిబ్రవరి 28కి ముందు ఉల్లంఘనలకు గురైన అన్ని కేటగిరీల ఎంట్రీ వీసాలకు సంబంధించి, సంబంధిత వ్యక్తులు తప్పనిసరిగా హాజరుకావాలని సూచించింది.
>ప్రతి ఒక్కరూ ఇంటి లోపలే ఉండాలని, తప్పనిసరి సందర్భాల్లో మాత్రమే బయటకు రావాలని కోరింది. కిటికీలు మరియు బహిరంగ ప్రదేశాలకు దూరంగా ఉండాలని సూచించింది. ప్రజా భద్రతను కాపాడటానికి సమర్థ అధికారులు జారీ చేసిన అధికారిక సూచనలను పాటించాలని కోరింది. ఏవైనా అప్డేట్ కోసం మంత్రిత్వ శాఖ అధికారిక సోషల్ మీడియా అకౌంట్లను ఫాలో కావాలని పిలుపునిచ్చింది.
తాజా వార్తలు
- ఔద్ మైథా రోడ్–అల్ అసాయెల్ స్ట్రీట్ అభివృద్ధి పనులు పూర్తి
- సెప్టెంబర్ 23న షేక్ మహమ్మద్ లీడర్షిప్ ఫోరం
- స్పోర్ట్స్ కోటా ఉద్యోగాల భర్తీ, విద్యా సంస్థల్లో అడ్మిషన్లపై ఏపీ ప్రభుత్వ కీలక నిర్ణయం
- షార్జా–ఒమన్ కారిడార్‌లో సరుకు రవాణా విలువ 66.26 శాతం వృద్ధి
- దుబాయ్: సోనాపూర్ క్యాంప్‌లో ఘనంగా గణేష్ ఉత్సవాలు..
- ఫుజైరా టెర్మినల్స్–అబుదాబి మధ్య ఎతిహాద్ రైల్ సర్వీస్ ప్రారంభం
- సెప్టెంబర్ 21 నుంచి షార్జా సఫారీ ఐదో సీజన్ ప్రారంభం
- ఖతార్‌లో సెప్టెంబర్ 20 నుంచి ‘అల్-జుబ్రా’ నక్షత్ర దశ.. వాతావరణంలో మార్పులు
- అక్టోబర్ 8 నుంచి అమెజాన్ సేల్
- దుబాయ్‌లో భారతీయులకు ఉచిత న్యాయ సలహాలు..







