టీమిండియాదే విజయం..కివీస్‌తో ఫైనల్ పోరుకు రెడీ..
- March 05, 2026
టీ20 వరల్డ్ కప్ లో భారత్ ఫైనల్ కి దూసుకెళ్లింది.సెమీస్ లో ఇంగ్లండ్ పై గెలుపొందింది. ఉత్కంఠభరితంగా సాగిన ఈ మ్యాచ్ లో భారత్ 7 పరుగుల తేడాతో విక్టరీ కొట్టింది. మార్చి 8న ఫైనల్లో న్యూజిలాండ్ తో భారత్ తలపడనుంది.
తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ భారీ స్కోర్ బాదింది. 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 253 పరుగులు చేసింది. ఇంగ్లండ్ ముందు 254 పరుగుల టార్గెట్ ఉంచింది. కళ్ల ముందు కొండంత లక్ష్యం ఉన్నా.. ఇంగ్లండ్ బ్యాటర్లు బెదరలేదు. దూకుడుగా ఆడారు. మరీ ముఖ్యంగా జాకబ్ బెతెల్ విధ్వంసకర బ్యాటింగ్ చేశాడు.పరుగుల వరద పారించాడు. ధాటిగా ఆడుతూ ఇంగ్లండ్ స్కోర్ బోర్డ్ ను పరుగులు పెట్టించాడు.భారత్ ను బాగా భయపెట్టాడు. 45 బంతుల్లోనే సెంచరీ బాదిన జాకబ్.. ఇంగ్లండ్ ను విజయం అంచుల వరకు తీసుకెళ్లాడు. చివరలో వికెట్లు పడటంతో, బెతెల్ రనౌట్ కావడంతో ఇంగ్లండ్ ఓటమి ఖాయమైపోయింది.
భారత బౌలర్లలో హార్ధిక్ పాండ్యా రెండు వికెట్లు తీశాడు. అర్ష్ దీప్ సింగ్, బుమ్రా, వరుణ్, అక్షర్ పటేల్ తలో వికెట్ పడగొట్టారు. మరీ ముఖ్యంగా బుమ్రా అద్భుతంగా బౌలింగ్ చేశాడు. తక్కువ పరుగులు ఇచ్చి (4 ఓవర్లు 33 పరుగులు 1 వికెట్) ప్రత్యర్థి బ్యాటర్లను కట్టడి చేయగలిగాడు.
తాజా వార్తలు
- కువైట్‌లో వారం రోజుల్లో 25 వేలకు పైగా ట్రాఫిక్ ఉల్లంఘనలు నమోదు..!!
- మస్కట్‌లో అల్ అమెరికాత్ ఓవర్‌పాస్ తాత్కాలికంగా మూసివేత..!!
- సోషల్ మీడియాలో పిల్లల ఫొటోల షేరింగ్ పై అబుదాబి కోర్టు కీలక తీర్పు..!!
- అబుదాబి నుంచి భారత్ లోని నాలుగు కొత్త నగరాలకు ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ ఫ్లైట్స్..!!
- అమ్మాన్లో అరబ్ దేశాల కీలక సమావేశం.. ఇజ్రాయెల్ చర్యలపై తీవ్ర ఆందోళన..!!
- సౌదీలో డొమెస్టిక్ వర్కర్ల బదిలీకి కొత్త సర్వీస్..!!
- హర్మూజ్ జలసంధిలో కొత్త వాణిజ్య మార్గంపై ఇరాన్, ఒమన్ మధ్య అంగీకారం
- పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో 'ఆప్'కే స్వల్ప ఆధిక్యం: 'పీపుల్స్ పల్స్' మూడ్ సర్వే
- బహ్రెయిన్‌లో రాత్రి 9 గంటల తర్వాత నిర్మాణ పనులకు బ్రేక్..పెరుగుతున్న డిమాండ్లు..!!
- ఎయిర్ ఇండియా కొత్త సీఈవోగా టెవోల్డ్ గెబ్రమరియమ్







