బహ్రెయిన్‌లో రాత్రి 9 గంటల తర్వాత నిర్మాణ పనులకు బ్రేక్..పెరుగుతున్న డిమాండ్లు..!!
- August 06, 2026
మనామా: బహ్రెయిన్‌లో నివాస ప్రాంతాల్లో రాత్రి వేళల్లో కొనసాగుతున్న నిర్మాణ పనులపై ప్రజల నుంచి ఫిర్యాదులు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో, రాత్రి 9 గంటల తర్వాత పనులు నిలిపివేయాలని సదర్న్ మున్సిపల్ కౌన్సిల్ సభ్యుడు అహ్మద్ అల్ అబ్దుల్లా డిమాండ్ చేశారు. నివాస ప్రాంతాలకు సమీపంలో చేపట్టే నిర్మాణ పనులకు స్పష్టమైన పని వేళలను నిర్ణయించాలని ఆయన సంబంధిత ప్రభుత్వ విభాగాలు, కాంట్రాక్టర్లకు సూచించారు. రాత్రంతా పనులు కొనసాగుతుండటంతో కుటుంబాలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయని, ఉదయం వరకు యంత్రాల శబ్దంతో నిద్ర లేక ఇబ్బందిపడుతున్నారని తెలిపారు.
ఇటీవల బ్లాక్ 915లోని నూన్ స్ట్రీట్‌లో రాత్రి 9 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు నిర్మాణ పనులు జరుగుతున్నాయని స్థానికులు ఫిర్యాదు చేసినట్లు వెల్లడించారు. ఈ శబ్ద కాలుష్యం కారణంగా ప్రజలు తమ ఇళ్లలో ప్రశాంతంగా విశ్రాంతి తీసుకోలేకపోతున్నారని అన్నారు. వేసవి కాలంలో మధ్యాహ్నపు పనులపై అమలులో ఉన్న నిషేధం కారణంగా కాంట్రాక్టర్లు రాత్రి వేళల్లో పనులు చేయాల్సిన పరిస్థితి ఉండొచ్చని, కానీ వాటి ప్రభావం నివాస ప్రాంతాల ప్రజలపై పడకూడదని అహ్మద్ అల్ అబ్దుల్లా స్పష్టం చేశారు. నివాస ప్రాంతాలను వాణిజ్య, పారిశ్రామిక ప్రాంతాలతో సమానంగా చూడకూడదని, కుటుంబాలకు ప్రశాంత వాతావరణం, గోప్యత కల్పించడం ప్రభుత్వ బాధ్యత అని పేర్కొన్నారు.
ప్రతి నిర్మాణ పనులు ప్రారంభానికి ముందే సంబంధిత శాఖలు, కాంట్రాక్టర్లు కలిసి పని వేళలను నిర్ణయించాలని, నివాస ప్రాంతాల్లో రాత్రి శబ్ద కాలుష్యాన్ని తగ్గించే నిబంధనలను తప్పనిసరిగా అమలు చేయాలని ఆయన సూచించారు. రహదారులు, ప్రజా పనులు వేగంగా పూర్తవ్వాల్సిందే కానీ, ప్రజల నిద్ర, ప్రశాంతత, కుటుంబ జీవనానికి భంగం కలిగించే విధంగా ఉండకూడదని ఆయన అభిప్రాయపడ్డారు.
తాజా వార్తలు
- ఇరాన్ కు అమెరికా మరో వార్నింగ్
- సౌదీలో భవన నిర్మాణ రంగం దూకుడు..!!
- ఇరాన్ దాడులకు మద్దతు కేసు..నిందితులకు షాకిచ్చిన కాసేషన్ కోర్టు..!!
- దుబాయ్ రియల్ ఎస్టేట్ మార్కెట్ కు మంచిరోజులు వస్తాయి..భారత్‌లో పెట్టుబడులపై ఆసక్తి..!!
- కువైట్‌లో మండుతున్న ఎండలు.. ముగిసిన మిడ్ డే వర్క్ నిషేధం..!!
- రిమాల్ అల్ షర్కియాహ్ పర్యాటక ప్రాంత అభివృద్ధిపై స్పెషల్ ఫోకస్..!!
- ‘ది న్యూయార్కర్’ కథనంపై తీవ్రంగా స్పందించిన ఖతార్..!!
- సెయింట్ లూయిస్‌లో NATS క్రీడా సంబరాలు
- రోబోటిక్, రిమోట్ సర్జరీతో వైద్య రంగంలో కువైట్ కీలక ముందడుగు
- సౌదీ రెడ్ సీ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ 2027కి వాయిదా







