'నమో రే' మార్చి 15న రిలీజ్
- March 05, 2026
మోస్ట్ ఎవైటెడ్ పాన్-ఇండియన్ మూవీ నాగబంధం అద్భుతమైన కంటెంట్ తో సంచలనం సృష్టిస్తోంది. అభిషేక్ నామా దర్శకత్వంలో NIK స్టూడియోస్ బ్యానర్‌పై కిషోర్ అన్నపురెడ్డి, నిషితా నాగిరెడ్డి నిర్మించిన ఈ చిత్రంలో విరాట్ కర్ణ హీరోగా నటించారు. ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్‌తో భారతీయ సినిమాలో కొత్త బెంచ్ మార్క్ క్రియేట్ చేయబోతోంది.
మార్చి 15న ఉదయం 11:11 గంటలకు నాగబంధం ఫస్ట్ సింగిల్ "నమో రే" రిలీజ్ కానుంది. ఈ పాట నారాయణుడికి నివాళిగా ఆధ్యాత్మికత ప్రజెంట్ చేయబోతోంది.
భారీ స్థాయిలో రూపొందుతున్న నాగబంధంలో “నమో రే” సాంగ్ ప్రధాన ఆకర్షణగా నిలవబోతోంది. ఈ పాటలో ఏకంగా 1,000 మంది డ్యాన్సర్లు పాల్గొంటూ, భారతీయ నృత్య కళల వైవిధ్యం, ఐక్యతను ప్రతిబింబించే అద్భుతమైన విజువల్ స్పెక్టాకిల్‌గా రూపొందించారు. ప్రముఖ కొరియోగ్రాఫర్లు గణేష్ ఆచార్య, శ్రష్టి వర్మ అద్భుతమైన కోరియోగ్రఫీ చేశారు.
“నమో రే” పాటకు సంగీతాన్ని జునైద్ కుమార్ – అభే జంట అందించగా, భక్తి భావం , ఆధ్యాత్మికతను ప్రతిబింబించేలా డ్రీమీ మ్యూజికల్ ట్రీట్ కంపోజ్ చేశారు. గేయరచయిత శ్రీహర్ష ఇమాని రాసిన సాహిత్యం పాట థీమ్‌కు అద్భుతంగా ప్రజెంట్ చేయబోతుంది. గాయకులు సింధుజా శ్రీనివాసన్, ఐశ్వర్య దారురి ఈ పాటకు ప్రాణం పోశారు.
సాంగ్ పోస్టర్‌లో నభా నటేష్, ఐశ్వర్య మీనన్‌లను సాంప్రదాయ వేషధారణలో అద్భుతంగా కనిపించడం పాటలోని గ్రాండియర్‌ను ప్రజెంట్ చేస్తోంది. ఈ పాటను అనంత పద్మనాభ స్వామి ఆలయాన్ని ప్రతిబింబించే భారీ సెట్లో చిత్రీకరించడం ద్వారా విజువల్‌గా మరింత వైభవాన్ని అందించారు.
ఈ చిత్రానికి టాప్ టెక్నికల్ టీమ్ పని చేస్తోంది. సినిమాటోగ్రఫీని సౌందర్ రాజన్ ఎస్ నిర్వహిస్తుండగా, ప్రొడక్షన్ డిజైన్ అశోక్ కుమార్ చేపట్టారు. బ్యాక్‌గ్రౌండ్ స్కోర్‌ను జునైద్ కుమార్ అందిస్తుండగా, ఎడిటింగ్‌ను ఆర్‌సి ప్రణవ్ నిర్వహిస్తున్నారు.
ఇప్పటికే విడుదలైన టీజర్‌కు ప్రేక్షకుల నుంచి అద్భుతమైన స్పందన లభించింది. దీంతో సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి. ఇప్పుడు విడుదలకు సిద్ధమవుతున్న ఫస్ట్ సింగిల్ “నమో రే” ఆ బజ్‌ను నెక్స్ట్ లెవల్ కి తీసుకెళ్లనుంది. నాగబంధం వేసవిలో విడుదలకు సిద్ధమవుతోంది.
తారాగణం: విరాట్ కర్ణ, నభా నటేష్, ఐశ్వర్య మీనన్, రిషబ్ సాహ్ని, జగపతి బాబు, గరుడ రామ్, మహేష్ మంజ్రేకర్, జయప్రకాష్, మురళీ శర్మ, అనసూయ భరద్వాజ్, బిఎస్ అవినాష్,
సాంకేతిక సిబ్బంది:
బ్యానర్: NIK స్టూడియోస్ & అభిషేక్ పిక్చర్స్
కథ, స్క్రీన్‌ప్లే & దర్శకత్వం: అభిషేక్ నామా
నిర్మాతలు: కిషోర్ అన్నపురెడ్డి, నిషిత నాగి రెడ్డి
డైరెక్టర్ ఆఫ్ ఫోటోగ్రఫీ: సౌందర్ రాజన్ ఎస్
సంగీతం: జునైద్ కుమార్ - అభే
బ్యాక్‌గ్రౌండ్ స్కోర్: జునైద్ కుమార్
CEO: వాసు పోతిని
ప్రొడక్షన్ డిజైనర్: అశోక్ కుమార్
డైలాగ్స్: కళ్యాణ్ చక్రవర్తి
ఎడిటర్: ఆర్‌సి ప్రణవ్
VFX డైరెక్టర్: అభిషేక్ నామా
సౌండ్ డిజైన్: సింక్ సినిమాస్
కాస్ట్యూమ్ డిజైనర్లు: రాజేష్ కమర్సు, చలమక్లా విభా రెడ్డి, శశి చౌదరి
యాక్షన్: కనల్ కన్నన్, వ్లాడ్ రిమ్‌బర్గ్ (USA), రియల్ సతీష్, కేచా ఖంఫక్డీ, నందు, రన్ నవరాచ్ (థాయ్‌లాండ్), జూనియర్ వెంకట్.
కొరియోగ్రఫీ: బృందా, గణేష్ ఆచార్య, శ్రష్టి వర్మ
సాహిత్యం: కాసర్ల శ్యామ్, కళ్యాణ్ చక్రవర్తి, శ్రీహర్ష ఈమని
స్క్రిప్ట్ డెవలప్‌మెంట్: రాజీవ్ ఎన్ కృష్ణ
DI: రెడ్ చిల్లీస్
కలరిస్ట్: కెన్ మెర్జ్కర్
DTS & Atmos: M.R. రాజాకృష్ణన్
VFX క్రియేటివ్ డైరెక్టర్: అభిషేక్ నామా
చీఫ్ కో-డైరెక్టర్: లలిత్ ప్రభాకర్ నాగ్ సూర్యదేవర
కో-డైరెక్టర్: వెంకర్ రెడ్డి కుంచం
అసోసియేట్ డైరెక్టర్లు: రమేష్ రావూరి, పెదబలి నిఖిలేశ్వర్ రెడ్డి
సహాయ దర్శకులు: రూప్‌కుమార్ మగాపు, ఎ. సుధీర్ కుమార్
ప్రొడక్షన్ కంట్రోలర్: రాఘవ, గణేశుని వెంకటేశ్వరరావు
ఎగ్జిక్యూటివ్ మేనేజర్లు: దూలం రమేష్, ఎండీ జాఫరుద్దీన్
ప్రొడక్షన్ మేనేజర్స్: బోయపాటి సతీష్, ఆనం నవీన్
పబ్లిసిటీ డిజైన్స్: కాని స్టూడియోస్
స్టిల్స్: స్నాపిన్ ఫోటోగ్రఫీ శివ
మార్కెటింగ్: హ్యాష్‌ట్యాగ్ మీడియా
PRO: వంశీ-శేఖర్
తాజా వార్తలు
- టీమిండియాదే విజయం..కివీస్‌తో ఫైనల్ పోరుకు రెడీ..
- ఖమేనీ మృతికి అధికారికంగా సంతాపం తెలిపిన భారత్
- ICC Mens T20 World Cup 2026: భారత్ భారీ స్కోర్..
- అమెరికా ట్యాంకర్ పై దాడి చేసిన ఇరాన్
- గల్ఫ్ దేశాలకు ఇటలీ బాసట
- షార్జా ఛారిటీ రికార్డు: మొదటి 15 రోజుల్లోనే 4.5 లక్షల ఇఫ్తార్ భోజనాల పంపిణీ!
- అబూదాబీ ICAD 2పై డ్రోన్ శకలాలు: ఆరుగురికి గాయాలు..
- Dh15 మిలియన్ జాక్‌పాట్ కొట్టిన షార్జా డ్రైవర్..!!
- పబ్లిక్ ప్లేసుల్లో అలాచేస్తే..OMR 300 ఫైన్, 3 నెలల జైలు..!!
- రిలీఫ్ ఫ్లైట్స్..ఖతార్ ఎయిర్వేస్ బిగ్ అప్డేట్..!!









