గుజరాత్ ప్రజలకు స్వాతంత్య్ర దినోత్సవ కానుక...
- August 01, 2016
గుజరాత్ ప్రజలకు స్వాతంత్య్ర దినోత్సవ కానుకను అందించబోతోంది ఆ రాష్ట్ర ప్రభుత్వం. ఆగస్టు 15 నుంచి గుజరాత్లో కార్లు, చిన్న వాహనదారులు టోల్ పన్నును కట్టాల్సిన అవసరం ఉండబోదట. ఈ మేరకు అక్కడి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
రాష్ట్ర వ్యాప్తంగా ఆగస్టు 15 నుంచి కార్లు, ఆటోరిక్షాలు, చిన్నవాహనాలను టోల్ ట్యాక్స్‌ల నుంచి మినహాయిస్తున్నట్లు గుజరాత్ ముఖ్యమంత్రి ఆనందీబెన్ పటేల్ ట్వీట్ చేశారు. నిరంతరం టోల్ బూత్‌లను దాటుకుంటూ ఆఫీసులకూ, కాలేజీలకూ వెళ్లే వాహనదారులకు ట్యాక్స్ కట్టడం భారంగా మారుతోందని.. అందుకే మినహాయింపు కల్పిస్తున్నట్లు ఆనందీబెన్ తెలిపారు. గుజరాత్లో వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
తాజా వార్తలు
- బహ్రెయిన్‌లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్‌లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!
- కువైట్‌లో 6 పోలీస్ స్టేషన్లు తాత్కాలికంగా మూసివేత..!
- కువైట్ విదేశాంగ మంత్రితో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్లో చర్చలు
- తలారి ముత్తన్న కుటుంబానికి తెలంగాణ గల్ఫ్ సమితి ఆర్థిక భరోసా
- లోక్ భవన్లో గవర్నర్ ఆయుధ పూజలు
- జనవరి దర్శన టికెట్ల విడుదల తేదీలు ఇవే.. పూర్తి షెడ్యూల్







