క్షమించడండి అంటూ ఇరాన్ అధ్యక్షుడి కీలక ప్రకటన
- March 07, 2026
దుబాయ్: మిడిల్ ఈస్ట్ లో యుద్ధం వేళ ఇరాన్ అధ్యక్షుడు మసౌద్ పెజెష్కియన్ సంచలన ప్రకటన చేశారు. టెలివిజన్‌లో కీలక ప్రసంగం చేశారు. పక్క దేశాలపై దాడులు చేయబోమని తెలిపారు. ఈ సందర్భంగా ఇరుగుపొరుగు దేశాలకు కూడా క్షమాపణలు చెప్పారు. “మా జోలికి రాకుంటే.. మీ జోలికి రాబోం.. ఇజ్రాయెల్, అమెరికాకు లొంగే ప్రసక్తే లేదు.” అని తేల్చి చెప్పారు. లొంగిపోవాలని కలలు కనే వారు కచ్చితంగా విఫలమవుతారన్నారు.
ప్రసంగ సమయంలో మసౌద్ పెజెష్కియన్ శాంతి హస్తాన్ని చూపారు. ఇరాన్ శాంతిని ప్రేమించే దేశమని.. ప్రాంతీయ స్థిరత్వం కోసమే సైనిక చర్యను నిలిపివేయాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. మన సార్వభౌమాధికారంపై దృఢమైన వైఖరిని తీసుకున్నట్లు వివరించారు.
ఇదిలా ఉంటే పెజెష్కియన్ టెలివిజన్ ప్రసంగానికి ముందు రష్యా అధ్యక్షుడు పుతిన్‌తో మాట్లాడారు. ఈ సందర్భంగా ఇద్దరి మధ్య కీలక సంభాషణ జరిగినట్లుగా తెలుస్తోంది. ప్రాంతీయ ఉద్రిక్తతలను తగ్గించడానికి రష్యా మద్దతు ఇస్తుందని పుతిన్ వెల్లడించారు. ఏదైనా సమస్యను బలవంతంగా కాకుండా చర్చలు.. దౌత్యం ద్వారా పరిష్కరించుకోవాలని సూచించారు.
అయితే అంతర్జాతీయ ఒత్తిడితోనే ఇరాన్ వైఖరి మారినట్లుగా నిపుణులు భావిస్తున్నారు. ప్రస్తుతం యుద్ధ భయాలు తారాస్థాయికి చేరడంతో ఇరాన్ అధ్యక్షుడు కీలక నిర్ణయం తీసుకున్నట్లుగా సమాచారం."గల్ఫ్ దేశాలపై దాడులను ఆపేస్తున్నాం..వారివైపు నుండి దాడి ఉంటే మాత్రం ప్రతిస్పందిస్తాం" - ఇరాన్ అధ్యక్షుడు
తాజా వార్తలు
- మస్కట్‌లో రోడ్ల అభివృద్ధికి భారీగా పనులు..భద్రత బలోపేతం..!!
- ఇరాన్ పై ట్రంప్ తీవ్ర హెచ్చరిక.. ఒప్పందం కుదరకపోతే ‘అంతం చేస్తా’
- రక్షణ, ఏరోస్పేస్ పరిశోధనలకు ఊతం.. బిట్స్ పిలానీ, DIAT మధ్య 20 అవగాహన ఒప్పందాలు
- ‘వందేమాతరం’ వివాదం..డీకే శివకుమార్ ప్రభుత్వానికి గవర్నర్ హెచ్చరిక
- కల్బాలో అల్ ఫ్రైష్ సరస్సు ప్రాజెక్టుకు షార్జా రూలర్ ఆమోదం
- హైదరాబాద్‌లో భారీ వర్షం..కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్
- 72వ జాతీయ చలనచిత్ర అవార్డుల్లో తెలుగు సినిమాకు ఘన గౌరవం
- మారిషస్ రాష్ట్రపతి చేతుల మీదుగా డా.గజల్ శ్రీనివాస్ ‘శ్రీమద్భగవద్గీత’ ఆల్బమ్ ఆవిష్కరణ
- ఎట్టకేలకు ఏపీలో నంది అవార్డులు..
- షేక్ అహ్మద్‌కు అంతిమ ప్రార్థనలు.. హాజరైన షేక్ మహమ్మద్, పలువురు రాజకుటుంబ సభ్యులు







