సీఎం సమక్షంలో 124 మంది మావోయిస్టుల లొంగుబాటు
- March 07, 2026
హైదరాబాద్: తెలంగాణలో మావోయిస్టు ఉద్యమానికి సంబంధించిన కీలక పరిణామం చోటుచేసుకోనుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమక్షంలో ఇవాళ భారీ సంఖ్యలో మావోయిస్టులు లొంగిపోనున్నట్లు సమాచారం. ఈ కార్యక్రమం సాయంత్రం 4 గంటలకు హైదరాబాద్‌లోని తెలంగాణ ఇంటిగ్రేటెడ్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్లో నిర్వహించే ప్రెస్‌మీట్‌లో జరగనుంది.
పోలీసులు మరియు కేంద్ర భద్రతా బలగాలు చాలా కాలంగా వెతుకుతున్న పలువురు మావోయిస్టులు ఇందులో భాగమవుతారని తెలుస్తోంది. మొత్తం 124 మంది మావోయిస్టులు ఆయుధాలతో సహా లొంగిపోనుండగా, వారిలో కొందరు కీలక నాయకుల అనుచరులు మరియు గన్‌మెన్లు కూడా ఉన్నట్లు సమాచారం.
ఇటీవలే సరెండర్ అయిన దేవ్ జి కు చెందిన గన్‌మెన్లు, అనుచరులు కూడా ఈ జాబితాలో ఉన్నారని తెలుస్తోంది. అయితే మావోయిస్టు ఉద్యమంలోని కీలక నేతముప్పాళ్ల లక్ష్మణ రావు (గణపతి) కూడా వీరిలో ఉంటారా? అనే అంశం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. ఈ లొంగుబాటు కార్యక్రమం తెలంగాణలో మావోయిస్టు కార్యకలాపాలపై ప్రభావం చూపుతుందా? అనే విషయంపై రాజకీయ మరియు భద్రతా వర్గాల్లో ఆసక్తి నెలకొంది.
తాజా వార్తలు
- ఇరాన్ పై ట్రంప్ తీవ్ర హెచ్చరిక.. ఒప్పందం కుదరకపోతే ‘అంతం చేస్తా’
- రక్షణ, ఏరోస్పేస్ పరిశోధనలకు ఊతం.. బిట్స్ పిలానీ, DIAT మధ్య 20 అవగాహన ఒప్పందాలు
- ‘వందేమాతరం’ వివాదం..డీకే శివకుమార్ ప్రభుత్వానికి గవర్నర్ హెచ్చరిక
- కల్బాలో అల్ ఫ్రైష్ సరస్సు ప్రాజెక్టుకు షార్జా రూలర్ ఆమోదం
- హైదరాబాద్‌లో భారీ వర్షం..కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్
- 72వ జాతీయ చలనచిత్ర అవార్డుల్లో తెలుగు సినిమాకు ఘన గౌరవం
- మారిషస్ రాష్ట్రపతి చేతుల మీదుగా డా.గజల్ శ్రీనివాస్ ‘శ్రీమద్భగవద్గీత’ ఆల్బమ్ ఆవిష్కరణ
- ఎట్టకేలకు ఏపీలో నంది అవార్డులు..
- షేక్ అహ్మద్‌కు అంతిమ ప్రార్థనలు.. హాజరైన షేక్ మహమ్మద్, పలువురు రాజకుటుంబ సభ్యులు
- రాస్ అల్ ఖైమా రూలర్ ని కలిసిన భారత కాన్సుల్ జనరల్ డాక్టర్ విష్ణువర్ధన్ రెడ్డి







