‘తండేల్’ రెండు ప్రతిష్టాత్మక అవార్డులు
- March 08, 2026
బెస్ట్ యాక్టర్ అవార్డు అందుకున్న నాగ చైతన్య – జాతీయ సమగ్రత చిత్రంగా ‘తండేల్’
యువ సామ్రాట్ నాగ చైతన్య హీరోగా, చందూ మొండేటి దర్శకత్వంలో తెరకెక్కిన సంచలన బ్లాక్‌బస్టర్ మూవీ ‘తండేల్’ గద్దర్ అవార్డ్స్ 2025లో రెండు ప్రతిష్టాత్మక అవార్డులు అందుకుంది. ఈ చిత్రంలో నాగ చైతన్య చేసిన అద్భుతమైన నటనకు బెస్ట్ యాక్టర్ అవార్డు లభించగా, అదే సమయంలో ఈ చిత్రం బెస్ట్ నేషనల్ ఇంటిగ్రేషన్ ఫిల్మ్ గా కూడా ఎంపికైంది.
ఈ అరుదైన రెండు అవార్డులు నాగ చైతన్య నటనలోని బలాన్ని మాత్రమే కాకుండా, చిత్రానికి ఉన్న సామాజిక ప్రాధాన్యతను కూడా ప్రతిబింబిస్తుంది. విభిన్న పాత్రలను ఎంచుకుంటూ తనదైన ముద్ర వేసుకుంటున్న నాగ చైతన్య ‘తండేల్’లో తన కెరీర్లోనే అత్యంత ప్రభావవంతమైన నటనను అందించారు. పాత్రలోని నిజాయితీ, సహజత్వాన్ని అద్భుతంగా చూపిస్తూ ప్రేక్షకుల ప్రశంసలు అందుకున్నారు.
గీతా ఆర్ట్స్ బ్యానర్‌పై బన్నీ వాసు నిర్మించిన ఈ చిత్రాన్ని అల్లు అరవింద్ సమర్పించారు. నాగ చైతన్య తన నటనకు రాష్ట్ర స్థాయి అవార్డు అందుకోవడం ఇదే మొదటిసారి కావడం విశేషం. భారీ పోటీ మధ్య కూడా ఆయన నటన ప్రత్యేకంగా నిలిచి ఈ గౌరవాన్ని సాధించింది. సరైన కథ, డైరెక్షన్ ఉంటే గ్రామీణ నేపథ్యంలోని పాత్రల్లో కూడా అద్భుతంగా మెప్పించగల నటుడిగా నాగ చైతన్య మరోసారి నిరూపించారు.
బెస్ట్ నేషనల్ ఇంటిగ్రేషన్ ఫిల్మ్ గా ‘తండేల్’ ఎంపిక కావడం కూడా చిత్రంలోని బలమైన సందేశాన్ని ప్రతిబింబిస్తోంది. ఐక్యత, మానవత్వం, సంస్కృతి వంటి అంశాలను స్పృశిస్తూ ప్రాంతీయ పరిమితులను దాటి ప్రేక్షకులతో అనుసంధానమయ్యే కథను ఈ సినిమా చెప్పింది. ముఖ్యంగా జాతీయ పతాకం, సంస్కృతిక మూలాలు వంటి అంశాలను చూపించిన తీరు ఈ పురస్కారానికి కారణమైంది.
తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన గద్దర్ అవార్డ్స్, గతంలో ఇచ్చిన నంది అవార్డులకు ప్రత్యామ్నాయంగా సినీ రంగంలో ప్రతిభను గౌరవించే వేదికగా నిలుస్తున్నాయి. గత సంవత్సరం ‘పుష్ప 2’ చిత్రానికి అల్లు అర్జున్ అవార్డ్ అందుకున్న తరువాత, ఈసారి ‘తండేల్’కు లభించిన రెండు ప్రతిష్టాత్మక అవార్డులు మరింత ప్రత్యేకంగా నిలిచాయి.
తాజా వార్తలు
- ఇరాన్ పై ట్రంప్ తీవ్ర హెచ్చరిక.. ఒప్పందం కుదరకపోతే ‘అంతం చేస్తా’
- రక్షణ, ఏరోస్పేస్ పరిశోధనలకు ఊతం.. బిట్స్ పిలానీ, DIAT మధ్య 20 అవగాహన ఒప్పందాలు
- ‘వందేమాతరం’ వివాదం..డీకే శివకుమార్ ప్రభుత్వానికి గవర్నర్ హెచ్చరిక
- కల్బాలో అల్ ఫ్రైష్ సరస్సు ప్రాజెక్టుకు షార్జా రూలర్ ఆమోదం
- హైదరాబాద్‌లో భారీ వర్షం..కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్
- 72వ జాతీయ చలనచిత్ర అవార్డుల్లో తెలుగు సినిమాకు ఘన గౌరవం
- మారిషస్ రాష్ట్రపతి చేతుల మీదుగా డా.గజల్ శ్రీనివాస్ ‘శ్రీమద్భగవద్గీత’ ఆల్బమ్ ఆవిష్కరణ
- ఎట్టకేలకు ఏపీలో నంది అవార్డులు..
- షేక్ అహ్మద్‌కు అంతిమ ప్రార్థనలు.. హాజరైన షేక్ మహమ్మద్, పలువురు రాజకుటుంబ సభ్యులు
- రాస్ అల్ ఖైమా రూలర్ ని కలిసిన భారత కాన్సుల్ జనరల్ డాక్టర్ విష్ణువర్ధన్ రెడ్డి







