కువైట్ లో అదుపులో ఎయిర్ పోర్ట్ ఫ్యుయల్ ట్యాంక్ ఫైర్..!!

- March 08, 2026 , by Maagulf
కువైట్ లో అదుపులో ఎయిర్ పోర్ట్ ఫ్యుయల్ ట్యాంక్ ఫైర్..!!

కువైట్: కువైట్ అంతర్జాతీయ విమానాశ్రయంలోని ఇంధన ట్యాంకులలో సంభవించిన మంటలను తమ అగ్నిమాపక బృందాలు విజయవంతంగా అదుపులోకి తెచ్చాయని కువైట్ అగ్నిమాపక దళం ప్రకటించింది. ఈ ఘటనలో  ఎవరికీ గాయాలు కాలేదని ధృవీకరించింది.

ఈ మేరకు పబ్లిక్ రిలేషన్స్ అండ్ మీడియా డైరెక్టర్ మరియు కువైట్ అగ్నిమాపక దళం అధికారిక ప్రతినిధి బ్రిగేడియర్ జనరల్ మొహమ్మద్ అల్-గరీబ్ తెలిపారు.  విమానాశ్రయంలో అగ్నిమాపక చర్యలు వేగంగా మరియు సమర్థవంతంగా నిర్వహించినట్లు వెల్లడించారు.   

విమానాశ్రయంలో పరిస్థితి అదుపులోకి వచ్చిందని,  ఇతర అగ్నిమాపక బృందాలు పబ్లిక్ ఇన్స్టిట్యూషన్ ఫర్ సోషల్ సెక్యూరిటీ ప్రధాన కార్యాలయంలో జరిగిన అగ్నిప్రమాదాన్ని సమర్థంగా అదుపులోకి తెచ్చారని అల్-గరీబ్ తెలిపారు. అయితే, పరిస్థితులు పూర్తిగా సురక్షితంగా ఉండేలా రెస్పాన్స్ టీమ్స్ ను మోహరించినట్లు వెల్లడించారు.  

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com