చరిత్ర సృష్టించిన భారత్.. టీ20 వరల్డ్ కప్ కైవసం
- March 08, 2026
అహ్మదాబాద్: ఐసీసీ మెన్స్ టీ20 వరల్డ్ కప్ 2026 విజేతగా భారత్ నిలిచింది. ఫైనల్ లో న్యూజిలాండ్ పై అద్భుత విజయంతో వరల్డ్ కప్ ను కైవసం చేసుకుంది. 96 పరుగుల తేడాతో కివీస్ ను చిత్తు చేసింది భారత్. తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా భారీ స్కోర్ చేసింది. 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 255 పరుగులు చేసింది. 256 రన్స్ టార్గెట్ తో బరిలోకి దిగిన కివీస్ 19 ఓవర్లలో 159 పరుగులకే ఆలౌట్ అయ్యింది.
టీ20 ప్రపంచ కప్‌లో భారత్ విజేతగా నిలవడం ఇది ముచ్చటగా మూడోసారి. తొలిసారి 2007లో, రెండోసారి 2024లో, ఇప్పుడు 2026లో భారత్ విశ్వ విజేతగా నిలిచింది. ఈ గెలుపుతో తొలిసారి ‘ట్రిపుల్’ సాధించిన జట్టుగా టీమిండియా రికార్డ్ నెలకొల్పింది. అంతేకాదు సొంతగడ్డపై నెగ్గిన తొలి టీమ్‌గా కొత్త చరిత్ర సృష్టించింది.
తాజా వార్తలు
- భారత జట్టు తదుపరి మ్యాచ్‌ల షెడ్యూల్ ఇదే..!
- బెంగళూరులో రేపటి నుంచి హోటళ్లు బంద్
- ప్రపంచంలోనే అత్యంత పరిశుభ్రమైన నగరంగా దుబాయ్–వరుసగా ఆరవ సంవత్సరం గుర్తింపు
- తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం..
- అమరవీరులకు కువైట్ కన్నీటి నివాళి: సైనిక లాంఛనాలతో అంత్యక్రియలు
- లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా పై విపక్షాలు అవిశ్వాస తీర్మానం
- యూఏఈలో హెలికాప్టర్ ప్రమాదం: ఇద్దరు సాయుధ దళాల సిబ్బంది మృతి
- గల్ఫ్ దేశాల్లో 12వ తరగతి పరీక్షలు వాయిదా–CBSE కీలక నిర్ణయం
- 23400 ఉల్లంఘనలు..1,200 వాహనాలు సీజ్..!!
- వీడియోలు, ఫోటోలు షేర్.. 313 మంది అరెస్టు..!!









