యూఏఈలోని భారతీయ స్కూళ్లకు ముందస్తు సెలవులు..!!
- March 09, 2026
యూఏఈ: యూఏఈ అంతటా పాఠశాలలు తమ విద్యా క్యాలెండర్లను సర్దుబాటు చేస్తున్నాయి. పరీక్షలు మరియు ఫలితాలు ట్రాక్‌లో ఉండేలా చూసుకుంటూ విద్యార్థులకు సంవత్సరాంతపు ముందస్తు సెలవులను ఇస్తున్నాయి.
సెలవుల్లో మార్పులు ఉన్నప్పటికీ, అకాడమిక్ కొనసాగింపులో రాజీపడటం లేదని పేరెంట్స్ మరియు విద్యార్థులకు హామీ ఇస్తున్నట్లు భారతీయ సిలబస్ స్కూళ్లలోని టీచర్లు చెబుతున్నారు.
అబుదాబిలోని షైనింగ్ స్టార్ ఇంటర్నేషనల్ స్కూల్ ప్రిన్సిపాల్ అభిలాషా సింగ్ మాట్లాడుతూ.. మార్చి 6న పరీక్షలు ముగిశాయని ధృవీకరించారు. కాబట్టి విద్యార్థుల పరీక్ష షెడ్యూల్‌కు ఎటువంటి అంతరాయం ఉండదని స్పష్టం చేశారు.
ప్రస్తుత అనిశ్చిత సమయాల్లో పరిణామాలను నిశితంగా పర్యవేక్షిస్తున్నట్లు తెలిపారు. పరీక్షల ఫలితాలను ప్రకటించేందుకు టీచర్లు రిమోట్‌గా పని చేస్తున్నారని పేర్కొన్నారు.
తగ్గిన పరీక్షా సమయం
దుబాయ్‌లో స్ప్రింగ్డేల్స్ స్కూల్ ప్రిన్సిపాల్ డేవిడ్ జోన్స్ మాట్లాడుతూ.. విద్యార్థులు ఇప్పటికే టర్మ్ 3 పరీక్షల మధ్యలో ఉన్నారని తెలిపారు. "భారతీయ సిలబస్ స్కూళ్లలో మేము సాధారణంగా స్ర్పింగ్ సెలవును పాటించము. బదులుగా, మేము మా సంవత్సరాంతపు పరీక్షలను నిర్వహిస్తాము. ఆ తర్వాత విద్యార్థులు వారి టర్మ్ సెలవులో వెళతారు" అని తెలిపారు. సవరించిన షెడ్యూల్‌కు అనుగుణంగా, మిగిలిన పరీక్షలు ఉదయం 9 గంటల నుండి 10 గంటల మధ్య ఆన్లైన్లో నిర్వహించబడతాయని అన్నారు. విద్యార్థులు ఒక గంటలోపు వాటిని పూర్తి చేయగలిగేలా ప్రశ్నాపత్రాలను రూపొందించారని తెలిపారు. 6 నుండి 8 క్లాసులకు సంబంధించి మ్యాథ్స్, సైన్స్ మరియు ఇంగ్లీష్ పరీక్షలకు హాజరవుతారని వెల్లడించారు.
ఇక 10 మరియు 12 తరగతులకు వెళ్లే విద్యార్థులకు బ్రిడ్జ్ తరగతులు నేటి నుంచి ప్రారంభమవుతాయని చెప్పారు. విద్యార్థులకు బ్రిడ్జ్ సెషన్లు ఆన్లైన్లో నిర్వహించనున్నట్లు వివరించారు.
మార్చి 3న రీ ఎగ్జామ్స్ షెడ్యూల్
రస్ అల్ ఖైమాలో ఇండియన్ స్కూల్ అధికారులు జూమ్ క్లాసులు మార్చి 6న ముగిసాయని తెలిపారు. మార్చి 30 వరకు స్ర్పింగ్ సెలవులను ఆస్వాదిస్తారని ప్రకటించారు. ఆ తర్వాత కొత్త విద్యా సంవత్సరం ప్రారంభమవుతుందని పేర్కొన్నారు.
సాధారణంగా కుటుంబాలు ముందస్తుగా ప్రణాళికలు వేసుకోవడానికి సహాయపడటానికి సమ్మర్ మరియు వింటర్ సెలవుల షెడ్యూల్లతో సహా రాబోయే విద్యా సంవత్సరానికి సంబంధించిన కీలక తేదీలను కూడా ముందుగానే పంచుకున్నారు. రీ ఎగ్జామ్స్ మార్చి 23న ప్రారంభం కానున్నాయని, త్వరలో వివరణాత్మక టైమ్‌టేబుల్ ను పేరెంట్స్ కు షేర్ చేస్తామని ప్రకటించారు.
తాజా వార్తలు
- భారత జట్టు తదుపరి మ్యాచ్‌ల షెడ్యూల్ ఇదే..!
- బెంగళూరులో రేపటి నుంచి హోటళ్లు బంద్
- ప్రపంచంలోనే అత్యంత పరిశుభ్రమైన నగరంగా దుబాయ్–వరుసగా ఆరవ సంవత్సరం గుర్తింపు
- తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం..
- అమరవీరులకు కువైట్ కన్నీటి నివాళి: సైనిక లాంఛనాలతో అంత్యక్రియలు
- లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా పై విపక్షాలు అవిశ్వాస తీర్మానం
- యూఏఈలో హెలికాప్టర్ ప్రమాదం: ఇద్దరు సాయుధ దళాల సిబ్బంది మృతి
- గల్ఫ్ దేశాల్లో 12వ తరగతి పరీక్షలు వాయిదా–CBSE కీలక నిర్ణయం
- 23400 ఉల్లంఘనలు..1,200 వాహనాలు సీజ్..!!
- వీడియోలు, ఫోటోలు షేర్.. 313 మంది అరెస్టు..!!









