వీడియోలు, ఫోటోలు షేర్.. 313 మంది అరెస్టు..!!
- March 09, 2026
దోహా: ఖతార్ లో అనధికార వీడియో క్లిప్‌లను చిత్రీకరించి, షేర్ చేసిన వివిధ దేశాలకు చెందిన 313 మంది వ్యక్తులను అరెస్టు చేసినట్లు అంతర్గత మంత్రిత్వ శాఖ ప్రకటించింది.
జనరల్ డైరెక్టరేట్ ఆఫ్ క్రిమినల్ ఇన్వెస్టిగేషన్‌లోని ఆర్థిక మరియు సైబర్ నేరాల నివారణ విభాగం అధికారిక ఆదేశాలను వీరు ఉల్లంఘించారని పేర్కొంది. సోషల్ మీడియాలో తప్పుదారి పట్టించేలా కంటెంట్, పుకార్లను వ్యాప్తి చేస్తున్నారని పేర్కొంది.
ఖతార్ లో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితికి సంబంధించిన వీడియో క్లిప్‌లను చిత్రీకరించడం, ప్రచురించడం లేదా పుకార్లను వ్యాప్తి చేయడం నేరమని అంతర్గత మంత్రిత్వ శాఖ గుర్తుచేసింది. అటువంటి ఉల్లంఘనలకు పాల్పడినట్లు తేలితే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది.
తాజా వార్తలు
- భారత జట్టు తదుపరి మ్యాచ్‌ల షెడ్యూల్ ఇదే..!
- బెంగళూరులో రేపటి నుంచి హోటళ్లు బంద్
- ప్రపంచంలోనే అత్యంత పరిశుభ్రమైన నగరంగా దుబాయ్–వరుసగా ఆరవ సంవత్సరం గుర్తింపు
- తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం..
- అమరవీరులకు కువైట్ కన్నీటి నివాళి: సైనిక లాంఛనాలతో అంత్యక్రియలు
- లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా పై విపక్షాలు అవిశ్వాస తీర్మానం
- యూఏఈలో హెలికాప్టర్ ప్రమాదం: ఇద్దరు సాయుధ దళాల సిబ్బంది మృతి
- గల్ఫ్ దేశాల్లో 12వ తరగతి పరీక్షలు వాయిదా–CBSE కీలక నిర్ణయం
- 23400 ఉల్లంఘనలు..1,200 వాహనాలు సీజ్..!!
- వీడియోలు, ఫోటోలు షేర్.. 313 మంది అరెస్టు..!!









