విదేశాలలో చిక్కుకున్న ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్..!!
- March 09, 2026
కువైట్: మిడిలీస్టు యుద్ధం నేపథ్యంలో ఫ్లైట్ సర్వీసులు రద్దు కావడంతో విదేశాలలో చిక్కుకుపోయిన ప్రభుత్వ ఉద్యోగులకు కువైట్ గవర్నమెంట్ గుడ్ న్యూస్ చెప్పింది. సదరు ఉద్యోగులు తిరిగి వచ్చే వరకు ఆ కాలాన్ని సర్వీస్ పీరియడ్ గానే లెక్కించనున్నట్లు కువైట్ సివిల్ సర్వీస్ బ్యూరో (CSB) వెల్లడించింది. ఈ మేరకు తన సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ Xలో ఒక ప్రకటన విడుదల చేసింది.
ప్రస్తుతం కొనసాగుతున్న ప్రాంతీయ పరిణామాల కారణంగా కువైట్‌కు తిరిగి రాలేని ఉద్యోగులకు ఈ నిర్ణయం మేలు చేస్తుందని తెలిపింది. ప్రభుత్వ మంత్రిత్వ శాఖలు, ఏజెన్సీలు మరియు ప్రభుత్వ సంస్థలకు ఈ ఉత్తర్వులు వర్తిస్తాయని CSB స్పష్టం చేసింది.
వైమానిక స్థావరాన్ని తిరిగి తెరిచిన తర్వాత లేదా అందుబాటులో ఉన్న ఏదైనా ఇతర మార్గాల ద్వారా దేశానికి తిరిగి వచ్చే వరకు అధికారిక సేవా కాలంగా పరిగణించబడుతుందని తెలిపింది.
ఉద్యోగికి సంబంధించి ఇప్పటికే ఆమోదించిన సెలవులు ముగిసిన తర్వాత లేదా వారు తిరిగి పని ప్రారంభించాలని భావించిన అధికారిక సెలవుల తర్వాత ఈ మినహాయింపు కాలం ప్రారంభమవుతుందని CSB వెల్లడించింది.
అయితే, ఉద్యోగులు కువైట్ వెలుపల ఉన్నట్లు నిర్ధారించే రుజువును కూడా సమర్పించాల్సి ఉంటుందని కువైట్ సివిల్ సర్వీస్ బ్యూరో పేర్కొంది.
తాజా వార్తలు
- కాంగోలో కుప్పకూలిన విమానం..14 మంది మృతి
- బహ్రెయిన్ చారిత్రక ప్రాంతాల పునరుద్ధరణకు చర్యలు..!!
- ఖతార్‌లో తాత్కాలికంగా ట్రాఫిక్ ఆంక్షలు.. వాటర్ లైన్ నిర్వహణ పనులు..!!
- లండన్‌లో ‘లివ్ ఒమన్’ ఎగ్జిబిషన్ ప్రారంభం..!!
- సౌదీ అరేబియాకు రక్షణగా..మక్కా ఒప్పందం అమలుపై కీలక నిర్ణయం..!!
- కువైట్‌లో ర్యాష్ డ్రైవింగ్‌పై కఠిన చర్యలు..!!
- దుబాయ్‌లో అనధికార ఆక్యుపెన్సీపై కఠిన చర్యలు..!!
- గణేష్ నిమజ్జనాలు ప్రశాంతంగా కొనసాగుతున్నాయి: డీజీపీ సీవీ ఆనంద్
- ఆసియా క్రీడల విజేతలకు సీఎం విజయ్ భారీ నగదు బహుమతి
- హత్యకు గురైన వ్యక్తి భార్య, కుమారుడు అదృశ్యమయ్యారన్న వార్తలను ఖండించిన షార్జా పోలీసులు







