చేనేత రంగాన్ని ప్రోత్సహించేందుకు స్మృతి ఇరానీ వినూత్నంగా ముందడుగు
- August 01, 2016
దేశంలో చేనేత రంగాన్ని ప్రోత్సహించేందుకు కేంద్ర జౌళిశాఖ మంత్రి స్మృతి ఇరానీ వినూత్నంగా ముందడుగు వేశారు. బిహార్ నుంచి తెప్పించిన చేనేత సిల్క్ చీరను ధరించిన ఆమె ఆ ఫొటోను ట్విట్టర్‌లో షేర్ చేశారు. అంతేకాకుండా ఐవేర్ హ్యాండ్లూమ్ యాష్‌ట్యాగ్ (#IWearHandloom)తో ఆమె సరికొత్త ఆన్‌లైన్ ఉద్యమానికి శ్రీకారం చుట్టారు. ప్రజలు కూడా చేనేత వస్త్రాలు ధరించి.. ఆ ఫొటోలను సోషల్ మీడియాలో అప్‌లోడ్ చేయాలని, ఐవేర్ హ్యాండ్లూమ్ యాష్‌ట్యాగ్ తో ఆ పోస్టుకు మరో ఐదుగురిని ట్యాగ్ చేయాలని, ఆ ఐదుగురు కూడా ఇలా చేయడం ద్వారా చేనేత కార్మికులకు అండగా నిలువాలని ఆమె కోరారు.ఎంతో ఘనవైభవం కలిగిన చేనేత రంగం ఇప్పుడు అనేక కష్టాలతో సతమతమవుతున్నది. మొన్నటివరకు కేంద్ర మానవ వనరుల అభివృద్ధిశాఖ మంత్రిగా ఉండి పలు వివాదాలు ఎదుర్కొన్న స్మృతిని ఆ శాఖ నుంచి తప్పించి.. కేంద్ర జౌళి శాఖకు బదలాయించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో చేనేత రంగం అభివృద్ధికి ఆమె సంకల్పించారు.
తాజా వార్తలు
- బహ్రెయిన్లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!
- కువైట్లో 6 పోలీస్ స్టేషన్లు తాత్కాలికంగా మూసివేత..!
- కువైట్ విదేశాంగ మంత్రితో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్లో చర్చలు
- తలారి ముత్తన్న కుటుంబానికి తెలంగాణ గల్ఫ్ సమితి ఆర్థిక భరోసా
- లోక్ భవన్లో గవర్నర్ ఆయుధ పూజలు
- జనవరి దర్శన టికెట్ల విడుదల తేదీలు ఇవే.. పూర్తి షెడ్యూల్







