ఇక ఇప్పట్లో కొత్త జిల్లాలు లేనట్లే

- August 01, 2016 , by Maagulf
ఇక ఇప్పట్లో కొత్త జిల్లాలు లేనట్లే

తెలంగాణ ప్రజలకు చేదు వార్త ప్రకటించబోతున్నాడు ముఖ్య మంత్రి కెసిఆర్. దసరా నుండి కొత్త జిల్లాలు వస్తాయని , కొత్త జిల్లాలో ధూమ్ ధామ్ గా దసరా జరుపుకుందామని ఆశ పడ్డ ప్రజలకు చేదు వార్త మిగలబోతుంది. ఇప్పట్లో కొత్త జిల్లాల ప్రస్తావన లేదని , ప్రస్తుతం ఉన్న రాజకీయపరిణామాల మధ్య కొత్త జిల్లాల అంశాన్ని పక్కన పెట్టమని ముఖ్యమంత్రి తెలిపినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
గత కొన్ని రోజులుగా తెలంగాణ ప్రభుత్వానికి ఎం సెట్ 2 లీకేజ్ వ్యవహారం పెద్ద తలనొప్పిగా మారింది. దానికి తోడు కృష్ణా పుష్కరాలకు ఏర్పాట్లు వంటి వాటి ఫై దృష్టి సారించాల్సి ఉన్నందున దసరాకు కొత్త జిల్లాల ఏర్పాటు లేదు అని ఖరారు అయ్యింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com