ఆంధ్రప్రదేశ్: నిరుద్యోగులకు శుభవార్త..
- March 14, 2026
అమరావతి: ఆంధ్రప్రదేశ్ నిరుద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం ఉగాది పండుగ కానుకగా భారీ నోటిఫికేషన్లు ఇచ్చేందుకు సిద్ధమవుతోంది. సుమారు 60 ప్రభుత్వ విభాగాల్లో ఖాళీగా ఉన్న 10,000 పోస్టుల భర్తీకి సంబంధించి ఏపీ ప్రభుత్వం ‘జాబ్ క్యాలెండర్’ విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది. దీనిపై అధికారిక కసరత్తు తుది దశకు చేరుకుంది.
ఏయే శాఖల్లో ఎన్ని పోస్టులంటే?
ఈ జాబ్ క్యాలెండర్లో అత్యధికంగా విద్యాశాఖలో నియామకాలు ఉండబోతున్నాయి. డీఎస్సీ (DSC) ద్వారా సుమారు 3,000కు పైగా ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. వీటితో పాటు ఏపీపీఎస్సీ ద్వారా 101 గ్రూప్-1, 470 గ్రూప్-2 పోస్టులను భర్తీ చేయనున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న వివిధ విశ్వవిద్యాలయాల్లో ఖాళీగా ఉన్న 1,500 అధ్యాపక పోస్టులు కూడా ఈ జాబ్ క్యాలెండర్లో చేర్చే అవకాశం ఉంది.
పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు ద్వారా మరో 1,000 పోస్టుల భర్తీకి గ్రీన్ సిగ్నల్ లభించింది. ఏయే విభాగాల్లో ఎన్నెన్ని ఖాళీలు ఉన్నాయనే అంశంపై మరో రెండు మూడు రోజుల్లో పూర్తిస్థాయి స్పష్టత వచ్చే అవకాశం ఉంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక నిరుద్యోగుల కోసం విడుదల చేయబోతున్న మొదటి అతిపెద్ద జాబ్ క్యాలెండర్ కావడంతో దీనిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.
తాజా వార్తలు
- మీ డేటాను పూర్తిగా తుడిచిపెట్టే 'వైపర్ మాల్వేర్'..యూఏఈ సైబర్ కౌన్సిల్ కీలక సూచనలు!*
- 16 వేల మంది ఉద్యోగులను ఇంటికి పంపనున్న మెటా!
- ప్రశాంతమైన రమదాన్ కోసం దుబాయ్ పోలీసుల అడుగులు
- జనసేన 13వ ఆవిర్భావ దినోత్సవం..
- గ్లోబల్ విలేజ్లో ఈద్ బాణాసంచా వేడుకలు రద్దు..
- ఆంధ్రప్రదేశ్: నిరుద్యోగులకు శుభవార్త..
- ఆహార భద్రతా వ్యవస్థను సమీక్షించిన మినిస్టర్ టీమ్..!!
- అల్ సహ్లా రోడ్డు ప్రమాదంలో ఇద్దరు ప్రవాసులు మృతి..!!
- ఫేక్ బ్రాండెడ్ గూడ్స్..మనీలాండరింగ్.. Dh1-మిలియన్ ఫైన్, ఏడాది జైలు..!!
- భద్రతా పరమైన సంఘటనల వీడియోలు తీయవద్దు..!!









