16 వేల మంది ఉద్యోగులను ఇంటికి పంపనున్న మెటా!
- March 14, 2026
టెక్ ఉద్యోగాలు ఈ ఏడాది కూడా ప్రమాదంలో చిక్కుకున్నాయి. ఏఐ రాకతో ఉద్యోగుల భవిష్యత్తు గాలిలో దీపంలా మారింది. AI ఖర్చులు రోజు రొజుకు పెరుగుతున్నందున కంపెనీలు ఉద్యోగులను తగ్గించి ఖర్చు భారాన్ని తగ్గించుకుంటున్నాయి. ఇప్పటికే ఎన్నో కంపెనీలు ఉద్యోగులను తొలగించగా అదే బాటలో మార్క్ జుకర్‌బర్గ్ టెక్ సంస్థ కూడా పయనిస్తోంది. దాదాపు 16 వేల ఉద్యోగాలను తగ్గించాలని యోచిస్తున్నట్లు రాయిటర్స్ నివేదిక పేర్కొంది. రాయిటర్స్ నివేదిక ప్రకారం.. మార్క్ జుకర్‌బర్గ్ నేతృత్వంలోని Meta కంపెనీ, ఖరీదైన కృత్రిమ మేధ (AI) మౌలిక సదుపాయాలను నిర్మించడానికి, AI-ఆధారిత సామర్థ్యాన్ని పెంచడానికి భారీ ఉద్యోగ కోతలను ప్రణాళికలో పెట్టింది. ఈ తొలగింపులు మొత్తం సిబ్బందిలో 20 శాతం వరకు, అంటే దాదాపు 16 వేల మంది ఉద్యోగులు ప్రభావితమవుతారని అంచనా. అయితే, ఈ తొలగింపులకు ఖచ్చితమైన తేదీలు లేదా సంఖ్య ఇంకా ఖరారు కాలేదు.
Meta టాప్ ఎగ్జిక్యూటివ్‌లు ఈ ప్రణాళికలను సీనియర్ నాయకులకు తెలియజేశారు. తిరిగి ఉద్యోగులను ఎలా మేనేజ్ చేయాలి, దానిపై ప్రణాళికలు వేయడం ప్రారంభమయ్యాయి.ఈ ప్రణాళికలు “సైద్ధాంతిక” అంశాలుగా మాత్రమే ఉన్నాయి. Meta డిసెంబర్ 31, 2025 నాటికి దాదాపు 79,000 మంది ఉద్యోగులను కలిగి ఉంది. 20 శాతం సంఖ్యను గణిస్తే, ఈ ఉద్యోగ కోత గత కొన్ని సంవత్సరాలలో అత్యంత పెద్ద తొలగింపుగా ఉంటుంది. గతంలో.. నవంబర్ 2022లో Meta 11 వేల మంది ఉద్యోగులను తొలగించింది (మొత్తం సిబ్బంది 13 శాతం) కాగా నాలుగు నెలల తర్వాత మరో 10 వేల మంది ఉద్యోగులను తగ్గించామని ప్రకటించింది.
AI ప్రాజెక్టులపై CEO జుకర్‌బర్గ్ గణనీయంగా దృష్టి సారిస్తున్నారు. ఈ ప్రణాళికలో జనరేటివ్ AI పరిశోధకులను కొత్త సూపర్ ఇంటెలిజెన్స్ బృందంలో చేర్చడానికి కంపెనీ వందల మిలియన్ల డాలర్ల వేతన ప్యాకేజీలు అందించింది. 2028 నాటికి డేటా సెంటర్ల నిర్మాణానికి 600 బిలియన్ డాలర్ల పెట్టుబడిని కూడా కంపెనీ యోచిస్తోంది.
తాజా వార్తలు
- బహ్రెయిన్ లో ఫుట్‌బాలర్ సహా ఐదుగురు అరెస్టు..!!
- జెడ్డా చాంబర్ బస్తా మార్కెట్ ప్రారంభం..!!
- పేలుళ్ల AI క్లిప్‌లు షేర్..10 మంది అరెస్టు..!!
- అక్సా మసీదు మూసివేతను ఖండించిన కువైట్..!!
- మస్కట్ లో EV ఛార్జింగ్ స్టేషన్ల విస్తరణ..!!
- ముందు జాగ్రత్త చర్యలు..నిర్దేశిత ప్రాంతాలను ఖాళీ చేయిస్తున్న ఖతార్..!!
- BCCI Naman Awards 2026: ఐదు టైటిళ్ల విజేతలకు అవార్డులు
- గ్యాస్ కనెక్షన్ కేవైసీ అప్డేట్ పేరుతో ఏపీకే ఫైల్స్..జాగ్రత్త!!
- మీ డేటాను పూర్తిగా తుడిచిపెట్టే 'వైపర్ మాల్వేర్'..యూఏఈ సైబర్ కౌన్సిల్ కీలక సూచనలు!
- 16 వేల మంది ఉద్యోగులను ఇంటికి పంపనున్న మెటా!









