ఖతార్ లో ప్లాంట్ 10 మిలియన్ ట్రీస్ ప్రాజెక్టులో భారీ పురోగతి..!!
- October 01, 2026
దోహా: ఖతార్‌లో పర్యావరణ పరిరక్షణ, పచ్చదనం పెంపునకు చేపట్టిన ‘ప్లాంట్ 10 మిలియన్ ట్రీస్’ ప్రాజెక్టులో ఇప్పటివరకు 4.8 మిలియన్ల చెట్లు నాటినట్లు మునిసిపాలిటీ మంత్రిత్వ శాఖ అండర్‌సెక్రటరీ హెచ్ఈ ఇంజినీర్ అలీ బిన్ మహమ్మద్ అల్ అలీ తెలిపారు. ఈ ప్రాజెక్టు లక్ష్యంలో దాదాపు సగానికి చేరువైందని ఆయన వెల్లడించారు. నేషనల్ ప్లానింగ్ కౌన్సిల్ నిర్వహించిన పాడ్‌కాస్ట్ అల్ తన్మియా ఎపిసోడ్లో ఆయన పాల్గొని పలు అంశాలపై వివరాలు వెల్లడించారు. ఆహార భద్రత, సరఫరా వ్యవస్థలు, 10 మిలియన్ల చెట్ల ప్రాజెక్టు, నివాస విల్లాల నిర్మాణ నిబంధనలు, మునిసిపల్ సేవల డిజిటలైజేషన్ వంటి అంశాలను వివరించారు.
ప్రధాన రహదారుల వెంట చెట్ల నాటకం
‘ప్లాంట్ 10 మిలియన్ ట్రీస్’ ప్రాజెక్టును దశలవారీగా అమలు చేస్తున్నట్లు అల్ అలీ తెలిపారు. సల్వా రోడ్ వంటి ప్రధాన రహదారుల వెంట కూడా చెట్లను నాటుతున్నామని చెప్పారు. ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థలతో పాటు ఖతార్ ఎనర్జీ సహకారంతో ఈ కార్యక్రమం కొనసాగుతోందన్నారు. ఇప్పటివరకు 4.8 మిలియన్ల చెట్లు నాటినట్లు ఆయన తెలిపారు.
ఆహార కొరత లేదు
ప్రాంతీయ సంక్షోభం ఫిబ్రవరి చివర్లో ప్రారంభమైనప్పటి నుంచి ఖతార్‌లో ఆహార సరఫరాలో ఎలాంటి కొరత నమోదు కాలేదని అల్ అలీ చెప్పారు. దేశంలో వ్యూహాత్మక ఆహార నిల్వలను పర్యవేక్షించే కమిటీ వారానికి రెండుసార్లు సమావేశమై నిల్వలను పరిశీలిస్తుందని తెలిపారు. స్థానిక ఉత్పత్తి, దిగుమతుల మధ్య సమతుల్యత సాధిస్తూ మార్కెట్లో నిరంతర సరఫరా ఉండేలా చర్యలు తీసుకుంటున్నట్లు వివరించారు. ఖతార్ పాల ఉత్పత్తుల్లో 100 శాతం, తాజా చికెన్ ఉత్పత్తిలో 99.9 శాతం స్వయం సమృద్ధి సాధించిందని ఆయన పేర్కొన్నారు.
ఒక్క రోజులో విల్లా నిర్మాణ అనుమతి
కృత్రిమ మేధస్సు (AI) వినియోగంతో నివాస విల్లాల నిర్మాణ అనుమతుల ప్రక్రియను వేగవంతం చేసినట్లు అల్ అలీ తెలిపారు. గతంలో 30 రోజులకు పైగా పట్టే అనుమతులు ప్రస్తుతం ఒక్క రోజులోనే జారీ చేస్తున్నట్లు చెప్పారు. AI వినియోగం వల్ల వేగం మాత్రమే కాకుండా తప్పులు తగ్గి, కన్సల్టెన్సీ కార్యాలయాల సామర్థ్యం కూడా పెరిగిందన్నారు.
29 మిలియన్ డాక్యుమెంట్స్ డిజిటలైజేషన్
మునిసిపల్ సేవల డిజిటల్ మార్పులో భాగంగా ఇప్పటివరకు దాదాపు 29 మిలియన్ డాక్యుమెంట్లను డిజిటలైజ్ చేసినట్లు అల్ అలీ తెలిపారు. ఫోన్, అప్లికేషన్ లేదా సోషల్ మీడియా ద్వారా వచ్చిన ఫిర్యాదులన్నింటినీ ఒకే కాల్ సెంటర్ ద్వారా స్వీకరించి, అవి వచ్చిన మార్గం ఆధారంగా కాకుండా సమస్య తీవ్రతను బట్టి ప్రాధాన్యత కేటాయిస్తున్నట్లు చెప్పారు.
కస్టమర్ సంతృప్తి 86 శాతానికి చేరిందని, 2025లో ‘ఔన్’ అప్లికేషన్, ఆన్లైన్ సేవల ద్వారా దాదాపు 1 మిలియన్ అభ్యర్థనలు అందాయని తెలిపారు. ‘ఔన్’ యాప్‌ను ఇప్పటివరకు 8 లక్షలకు పైగా డౌన్లోడ్ చేసుకున్నట్లు వెల్లడించారు.
విల్లా నిర్మాణ నిబంధనల్లో మార్పులు
ఖతారీ కుటుంబాల అవసరాలకు అనుగుణంగా నివాస విల్లాల నిర్మాణ నిబంధనలను నవీకరించినట్లు అల్ అలీ తెలిపారు. కొత్త నిబంధనలు అమల్లోకి వచ్చిన తర్వాత ఇప్పటివరకు మంత్రిత్వ శాఖకు కేవలం ఒక్క మినహాయింపు అభ్యర్థన మాత్రమే వచ్చినట్లు చెప్పారు. కొత్త నిబంధనల్లో కనీస ప్లాట్ విస్తీర్ణాన్ని 400 చదరపు మీటర్లకు తగ్గించినట్లు తెలిపారు. దీని వల్ల కొత్త ఉద్యోగులు కూడా ప్లాట్ పొందుకుని ఇల్లు నిర్మించుకునే అవకాశం ఉంటుందని వివరించారు.
తాజా వార్తలు
- ఒమన్‌లో 3.4% పెరిగిన ఆరోగ్య సంస్థలు..!!
- వృద్ధుల హెల్త్ చెకప్స్.. బహ్రెయిన్ ఎంపీ కీలక ప్రతిపాదనలు..!!
- యూఏఈలో కొత్త ప్రయాణ ప్రత్యామ్నాయంగా ఎతిహాద్ రైలు..!!
- ఖతార్ లో ప్లాంట్ 10 మిలియన్ ట్రీస్ ప్రాజెక్టులో భారీ పురోగతి..!!
- సౌదీలో పార్కింగ్‌పై కొత్త నిబంధనలు..!!
- కువైట్‌లో నిర్మాణ వ్యర్థాలు.. ఓనర్లకు కీలక సూచనలు..!!
- యూఏఈ–భారత్ సాంస్కృతిక సహకారానికి మరింత బలోపేతం
- ఒమన్‌లో అక్టోబర్ 11 నుంచి యూరోపియన్ ఫిల్మ్ ఫెస్టివల్..!!
- విద్యాశాఖ ఆధ్వర్యంలో ‘SACT’ కాంపిటీషన్ ప్రారంభం..!!
- సహల్ యాప్‌లో ప్రభుత్వ శాఖలకు నేరుగా ఫిర్యాదులు..!!







