తెలుగు చిత్ర పరిశ్రమపై సాయి కుమార్ సంచలన వ్యాఖ్యలు
- July 22, 2015
తెలుగు సినిమా పరిశ్రమలో మంచి గుర్తింపు తెచ్చుకున్న నటుల్లో సాయి కుమార్ ఒకరు. హీరోగా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా, డబ్బింగ్ ఆర్టిస్టుగా, టెలివిజన్ యాంకర్ గా ఆయన తనకంటూ ప్రత్యేక స్థానం సంపాదించుకున్నారు. పోలీస్ స్టోరీ చిత్రంలో పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్ర పోషించిన ఆయన విజయవాడ పోలీస్ బ్రాండ్ అంబాసిడర్ గా కూడా నియమితులయ్యారు. అయితే తెలుగు సినిమా పరిశ్రమలో తనకు దక్కాల్సిన గుర్తింపు దక్కలేదంటున్నాడు సాయి కుమార్. ఇటీవల ఆయన మాట్లాడుతూ...కన్నడ సినీ పరిశ్రమ గుర్తించినంతగా తనను తెలుగు సినిమా పరిశ్రమ గుర్తించలేదని వ్యాఖ్యానించారు. కన్నడలో సంవత్సరానికి ఏడెనిమిది సినిమాలు హీరోగా చేస్తున్న సమయంలో కూడా తెలుగు దర్శక నిర్మాతలు తనను కేవలం డబ్బింగ్ ఆర్టిస్టుగానే చూసారు' అని అన్నారు. తెలుగులో పోలీస్ స్టోరీ చిత్రం రాకుండా ఉంటే...ఇప్పటికీ అంతా నన్ను మరిచిపోయేవారు' అని వ్యాఖ్యానించారు. తన టాలెంటుకు తగిన అవకాశాలు, పాత్రలు రావడం లేదని సాయి కుమార్ ఫీలువుతున్నట్లు ఆయన మాటల్లో స్పష్టమవుతోంది. అయితే పలువురు తెలుగు ఫిల్మ్ మేకర్స్ మాత్రం ఆయనకు తగిన గుర్తింపు ఇచ్చామని అంటున్నారు.
తాజా వార్తలు
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!







