గల్ఫ్ జనసేన కువైట్ ఆధ్వర్యంలో కువైత్ లో రక్తదాన కార్యక్రమం

- March 15, 2026 , by Maagulf
గల్ఫ్ జనసేన కువైట్ ఆధ్వర్యంలో కువైత్ లో రక్తదాన కార్యక్రమం

కువైట్ సిటీ: గల్ఫ్ జనసేన జాతీయ కన్వీనర్ కంచన శ్రీకాంత్ ఆద్వయంలో కువైట్ లో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని రక్త దాన అవసరాన్ని గుర్తించి కువైత్ లోని జాబ్రియా బ్లడ్ బ్యాంక్ లో జనసైనికులు, మెగా అభిమానులు రక్తదానం చేయడం జరిగింది.

జనసేన పార్టీ ఆవిర్భావం నుండి గల్ఫ్ లోని కువైట్ దేశం లో ఎన్నారై జనసేన నాయకులు పార్టీ కోసం వెన్నుదండుగా తోడ్పాటు అందిస్తున్న సంగతి అందరికి తెలిసిందే. ఇటు పార్టీ ఆవిర్భావ దినోత్సవం అయిన అటు అధినాయకుడు పవన్ కళ్యాణ్ జన్మదినం వచ్చిన గల్ఫ్ జనసేన కువైట్ కార్యవర్గం సేవా మరియు సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించడం ఆనవాయితీ గా వస్తుంది.

ప్రస్తుతం కువైట్ లో నెలకొన్న యుద్ధవాతావరణం కారణంగా ఇక్కడి ప్రభుత్వ ఆజ్ఞ మేరకు ఈసారి హంగు ఆర్భాటాలు లేకుండా రక్తదాన కార్యక్రమం నిర్వహించినట్టు జాతీయ కన్వీనర్ శ్రీకాంత్ తెలిపారు. అలాగే సేవకు మారుపేరుగా నిలిచిన జనసేన పార్టీ నాయకులు గా పవన్ కళ్యాణ్ సిద్ధాంతాలను అనుసరించి ఆయన బాటలోనే నడుస్తూ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ప్రస్తుతం కువైట్ లో రక్తదానం చేయడం చాలా సంతోషంగా ఉందని కువైట్ కన్వీనర్లు అంజన్ కుమార్,ఆకుల రాజేష్ కో-కన్వీనర్లు దండు చంద్రశేఖర్ గారు జగిలి ఒబిలేషు గారు ఇమ్మిడి శెట్టి సూర్య తెలిపారు.

ఈ కార్యక్రమములో కూటమి సభ్యులు గల్ఫ్ ఎంపవర్మెంట్ కో-ఆర్డినేటర్ మరియు తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు కుదరవల్లి సుధాకర్ రావు, తెలుగు దేశం పార్టీ కువైట్ అధ్యక్షులు మద్దిన ఈశ్వర్ నాయుడు, కొల్లి ఆంజనేయులు గారు పాల్గొని శుభాకాంక్షలు తెలిపారు. 

ఈ కార్యక్రమానికి జనసేన పార్టీ నాయకులు గంగారపు చంద్ర శేఖర్, ప్రదీప్, గిడుగు రాంబాబు, గిడుగు యేసు బాబు,యూత్ వింగ్ అల్లం ప్రేమ్ రాయల్,కొమ్మినేని బాలాజీ గారు,రెడ్డిమని, ఇతర జనసేన పార్టీ కార్యవర్గ సభ్యులు హాజరయ్యి రక్తదానం చేయడం జరిగింది.రక్తదానం అనంతరం ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జనసేన నాయకులు కూటమి నాయకులతో కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలుపుకోవడం జరిగింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com