నాలుగు రాష్ట్రాలకు ఎన్నికల షెడ్యూల్, మే 4న కౌంటింగ్
- March 15, 2026
న్యూ ఢిల్లీ: కేంద్ర ఎన్నికల సంఘం నాలుగు రాష్ట్రాలు మరియు ఒక కేంద్ర పాలిత ప్రాంతానికి సంబంధించిన అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్‌ను ప్రకటించింది. తమిళనాడు, పశ్చిమ బెంగాల్, అస్సాం, కేరళ రాష్ట్రాలతో పాటు పుదుచ్చేరిలో ఎన్నికలు జరగనున్నాయి.
ఎన్నికల సంఘం వెల్లడించిన షెడ్యూల్ ప్రకారం ఏప్రిల్ 9న అస్సాం, కేరళ మరియు పుదుచ్చేరిలో పోలింగ్ నిర్వహించనున్నారు. తమిళనాడులో ఏప్రిల్ 23న ఒకే దశలో ఎన్నికలు జరగనున్నాయి.
పశ్చిమ బెంగాల్లో మాత్రం రెండు దశల్లో ఎన్నికలు నిర్వహించనున్నారు. మొదటి దశ పోలింగ్ ఏప్రిల్ 23న జరగగా, రెండో దశ ఏప్రిల్ 29న జరుగుతుంది.
నాలుగు రాష్ట్రాలు మరియు పుదుచ్చేరి కలిపి మొత్తం 824 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. రాష్ట్రాల వారీగా చూస్తే తమిళనాడులో 234, పశ్చిమ బెంగాల్లో 294, కేరళలో 140, అస్సాంలో 126 స్థానాలకు ఎన్నికలు నిర్వహించనున్నారు. పుదుచ్చేరిలో 30 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి.
తాజా వార్తలు
- సెయింట్ లూయిస్‌లో NATS క్రీడా సంబరాలు
- రోబోటిక్, రిమోట్ సర్జరీతో వైద్య రంగంలో కువైట్ కీలక ముందడుగు
- సౌదీ రెడ్ సీ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ 2027కి వాయిదా
- ఏపీ రాజధాని కోసం మరో 14.36 ఎకరాలు..
- మెడికల్ విద్యార్థినికి రూ.2 లక్షలు సాయం చేసిన కేటీఆర్
- భారత్-యూఏఈ వాణిజ్య, పెట్టుబడి సంబంధాల బలోపేతం పై చర్చలు
- అక్టోబర్ 8న దుబాయ్ మిరాకిల్ గార్డెన్ సీజన్-15 ప్రారంభం.. టికెట్ ధరలు ఇవే
- ఇరాన్ విమానయాన రంగం పై అమెరికా మరింత ఆంక్షల హెచ్చరిక
- షేక్ అహ్మద్ బిన్ రషీద్ అల్ మక్తూమ్ మృతికి ప్రెసిడెన్షియల్ కోర్టు సంతాపం
- ఇతరుల ఐడీలతో సిమ్ వాడుతున్నారా? కేంద్రం DoT హెచ్చరికలు ఇవే!







