కేంద్రం సంచలనం..వాళ్లంతా గ్యాస్ సిలిండర్స్ వెనక్కి ఇచ్చేయాలి..
- March 15, 2026
న్యూ ఢిల్లీ: దేశంలో గ్యాస్ సిలిండర్ల కొరత నేపథ్యంలో కేంద్రం శనివారం ఒక ప్రకటన చేసింది. పీఎన్జీతో పాటు ఎల్పీజీ కనెక్షన్ కూడా ఉంటే.. ఆ వినియోగదారులు వెంటనే తమ ఎల్పీజీ కనెక్షన్‌ను తక్షణమే సరెండర్ చేయాలని సూచించింది.అలాగే ప్రభుత్వ ఆయిల్ కంపెనీలు, వారి డిస్ట్రిబ్యూటర్ల ద్వారా ఎల్పీజీ (LPG) సిలిండర్ రీఫిల్ తీసుకోవద్దని కూడా సూచించింది.
మధ్యప్రాచ్యంలో కొనసాగుతున్న సంక్షోభం కారణంగా ప్రపంచవ్యాప్తంగా ఇంధన సరఫరాలో అంతరాయం ఏర్పడిన నేపథ్యంలో కేంద్రం నోటిఫికేషన్ జారీ చేసింది. దీంతో పాటు పీఎన్జీ (PNG) వినియోగదారులు కొత్తగా డొమెస్టిక్ ఎల్పీజీ కనెక్షన్ తీసుకోవడాన్ని కూడా నిషేధించారు.
నివారం విడుదల చేసిన నోటిఫికేషన్లో ఇలా పేర్కొన్నారు: “పైప్డ్ నేచురల్ గ్యాస్ కనెక్షన్ ఉన్న వ్యక్తి, అదే సమయంలో డొమెస్టిక్ ఎల్పీజీ కనెక్షన్‌ను కొనసాగించకూడదు. అలాగే ప్రభుత్వ ఆయిల్ కంపెనీల నుంచి లేదా వారి డిస్ట్రిబ్యూటర్ల ద్వారా ఎల్పీజీ సిలిండర్ రీఫిల్ కూడా తీసుకోకూడదు. అలాంటి వారు తమ ఎల్పీజీ కనెక్షన్‌ను వెంటనే సరెండర్ చేయాలి.”
మధ్య ప్రాచ్యంలో నెలకొన్న ఉద్రిక్తతల కారణంగా మన దేశంలో గ్యాస్ సిలిండర్ సరఫరాలో తీవ్ర అంతరాయం ఏర్పడుతోంది. ఈ ప్రభావం ఎక్కువగా హోటళ్లు, రెస్టారెంట్లు, హాస్టళ్ల మీద పడుతోంది. ఇప్పటికే చాలా హోటళ్లు అధిక గ్యాస్ వినియోగించుకునే వంటలను మెనూ నుంచి తొలగించాయి.
తాజా వార్తలు
- సెయింట్ లూయిస్‌లో NATS క్రీడా సంబరాలు
- రోబోటిక్, రిమోట్ సర్జరీతో వైద్య రంగంలో కువైట్ కీలక ముందడుగు
- సౌదీ రెడ్ సీ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ 2027కి వాయిదా
- ఏపీ రాజధాని కోసం మరో 14.36 ఎకరాలు..
- మెడికల్ విద్యార్థినికి రూ.2 లక్షలు సాయం చేసిన కేటీఆర్
- భారత్-యూఏఈ వాణిజ్య, పెట్టుబడి సంబంధాల బలోపేతం పై చర్చలు
- అక్టోబర్ 8న దుబాయ్ మిరాకిల్ గార్డెన్ సీజన్-15 ప్రారంభం.. టికెట్ ధరలు ఇవే
- ఇరాన్ విమానయాన రంగం పై అమెరికా మరింత ఆంక్షల హెచ్చరిక
- షేక్ అహ్మద్ బిన్ రషీద్ అల్ మక్తూమ్ మృతికి ప్రెసిడెన్షియల్ కోర్టు సంతాపం
- ఇతరుల ఐడీలతో సిమ్ వాడుతున్నారా? కేంద్రం DoT హెచ్చరికలు ఇవే!







