స్ప్రింగ్ బ్రేక్ తర్వాత మరో రెండు వారాలు ఆన్‌లైన్ క్లాసులు..

- March 17, 2026 , by Maagulf
స్ప్రింగ్ బ్రేక్ తర్వాత మరో రెండు వారాలు ఆన్‌లైన్ క్లాసులు..

యూఏఈ: ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా విద్యార్థుల క్షేమాన్ని కాపాడుతూనే, చదువుకు ఆటంకం కలగకుండా ఉండేందుకు యూఏఈ ప్రభుత్వం మంగళవారం మూడు కీలక నిర్ణయాలను ప్రకటించింది. ఇందులో భాగంగా, దేశవ్యాప్తంగా ఉన్న పాఠశాలలు మరియు ఉన్నత విద్యా సంస్థలకు స్ప్రింగ్ బ్రేక్ ముగిసిన తర్వాత మరో రెండు వారాల పాటు డిస్టెన్స్ లెర్నింగ్ (Distance Learning) కొనసాగుతుంది.

ముఖ్యమైన నిర్ణయాలు ఇవే:

  • నర్సరీలు, కిండర్ గార్టెన్‌లు మరియు ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల్లోని విద్యార్థులతో పాటు టీచింగ్ మరియు అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ అందరికీ మూడవ విద్యా టర్మ్ (Term 3) ప్రారంభం నుండి రెండు వారాల పాటు ఆన్‌లైన్ క్లాసులు నిర్వహించబడతాయి. పరిస్థితిని ప్రతి వారం సమీక్షిస్తూ తదుపరి నిర్ణయాలు తీసుకుంటారు.
  • ఉన్నత విద్యా సంస్థలకు కూడా రెండు వారాల పాటు డిస్టెన్స్ లెర్నింగ్ వర్తిస్తుంది. అయితే, అకడమిక్ మరియు అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ విషయంలో ఆయా సంస్థలు తగిన ఏర్పాట్లు చేసుకోవచ్చు.
  • తల్లిదండ్రులకు వెసులుబాటు: కిండర్ గార్టెన్ నుండి గ్రేడ్ 8 వరకు చదువుతున్న పిల్లల తల్లిదండ్రుల కోసం (తండ్రి లేదా తల్లి) ఫెడరల్ ప్రభుత్వ సంస్థలు 'రిమోట్ వర్క్' (ఇంటి నుండి పని) సౌకర్యాన్ని కల్పించాయి. తమ పిల్లల ఆన్‌లైన్ చదువులను పర్యవేక్షించేందుకు ఇది ఎంతగానో తోడ్పడుతుంది.

గల్ఫ్ ప్రాంతంలో నెలకొన్న ఉద్రిక్తతల వల్ల మార్చి 2 నుండి తరగతులు ఆన్‌లైన్‌లోకి మారాయి. ఆ తర్వాత మార్చి 9 నుండి 22 వరకు ముందుగానే స్ప్రింగ్ బ్రేక్ ప్రకటించారు. ఇప్పుడు మార్చి 23 నుండి క్లాసులు తిరిగి ప్రారంభం కావాల్సి ఉండగా, మరో రెండు వారాలు ఆన్‌లైన్ పద్ధతిలోనే నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది.

ప్రైవేట్ విద్యా సంస్థలు తమ అవసరాలను బట్టి ఇన్-పర్సన్ లెర్నింగ్ (In-person learning) కోసం అభ్యర్థనలు పెట్టుకునే అవకాశం కూడా ఉంది. అయితే విద్యార్థుల భద్రత విషయంలో రాజీ పడకూడదని ప్రభుత్వం స్పష్టం చేసింది.

--బాజీ షేక్(యూఏఈ)

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com