సచివాలయ ఉద్యోగులకు అలర్ట్: కొత్త అటెండెన్స్ రూల్స్ ఇవే

- March 17, 2026 , by Maagulf
సచివాలయ ఉద్యోగులకు అలర్ట్: కొత్త అటెండెన్స్ రూల్స్ ఇవే

అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని స్వర్ణ గ్రామ మరియు స్వర్ణ వార్డు సచివాలయాల్లో పనిచేస్తున్న ఉద్యోగుల జవాబుదారీతనం పెంచేందుకు ప్రభుత్వం హాజరు నిబంధనలను కఠినతరం చేసింది. పారదర్శకమైన పాలన అందించడమే లక్ష్యంగా ‘ఫేసియల్ రికగ్నిషన్’ (Facial Recognition) హాజరు విధానంలో మార్పులు చేస్తూ తాజా ఉత్తర్వులు జారీ చేసింది.

తాజా హాజరు నిబంధనల ప్రకారం.. స్వర్ణ గ్రామ, స్వర్ణ వార్డు సచివాలయ ఉద్యోగులు ఇకపై తప్పనిసరిగా ఉదయం 10 గంటల 30 నిమిషాల లోపు ఫేసియల్ రికగ్నిషన్ యాప్ ద్వారా హాజరు నమోదు చేయాల్సి ఉంటుంది. పది నిమిషాల గ్రేస్ టైమ్ అవకాశం కల్పించారు. దీంతో పది గంటల 40 నిమిషాలలోపు హాజరు నమోదు చేయాలి.ఉద్యోగులు 10 గంటల 40 నిమిషాల తర్వాత అటెండెన్స్ నమోదు చేస్తే.. ఆలస్యంగా గుర్తించి సెలవుగా పరిగణిస్తారు.

ఉద్యోగులు ఒకవేళ ఏదైనా అనివార్య కారణాల వలన ఉదయం 10 గంటల 40 నిమిషాల నుంచి 11 గంటల 30 నిమిషాల మధ్య హాజరు నమోదు చేయాల్సి వస్తే.. సచివాలయాల డీడీవో ముందస్తు అనుమతి తీసుకోవాలి. నెలకు కేవలం మూడు సార్లు మాత్రమే ఈ అవకాశం ఉంటుంది. అనుమతి తీసుకోకపోయినా, మూడుసార్లు పూర్తి అయిన ఉద్యోగులు.. ఉదయం 10 గంటల 40 నిమిషాల నుంచి 11 గంటల 30 నిమిషాల మధ్య హాజరు నమోదుచేస్తే.. హాఫ్ డే లీవ్‌గా పరిగణిస్తారు. అలాగే 11 గంటల 30 నిమిషాల నుంచి 2 గంటల మధ్య హాజరు నమోదు చేస్తే హాఫ్ డే లీవ్‌గా పరిగణిస్తారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com