వైమానిక దాడిలో ఇరాన్ భద్రతా చీఫ్ మృతి

- March 18, 2026 , by Maagulf
వైమానిక దాడిలో ఇరాన్ భద్రతా చీఫ్ మృతి

టెహ్రాన్: వైమానిక దాడిలో భద్రతా చీఫ్ అలీ లరిజానీ మృతి అధికారికంగా ప్రకటించిన ఇరాన్. ఇరాన్‌కు భారీ ఎదురుదెబ్బ తగిలింది. ఆ దేశ సుప్రీం నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్ చీఫ్ అలీ లరిజానీ వైమానిక దాడిలో మరణించినట్లు ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది. ఈ దాడిలో ఆయనతో పాటు కుమారుడు, అంగరక్షకులు కూడా ప్రాణాలు కోల్పోయినట్లు వెల్లడించారు.

ఇజ్రాయెల్ దాడిలోనే లరిజానీ మృతి చెందినట్లు వచ్చిన వార్తలకు ఇరాన్ ప్రకటనతో బలం చేకూరింది. ఈ ఘటనతో ఇప్పటికే ఉద్రిక్తంగా ఉన్న పశ్చిమాసియా పరిస్థితులు మరింత విషమించే అవకాశముందని అంతర్జాతీయ విశ్లేషకులు భావిస్తున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com