Skytrax అవార్డులు, Expo నుండి వైదొలిగిన హమద్ ఎయిర్ పోర్ట్..!!
- March 18, 2026
దోహా: ఈ ప్రాంతంలో కొనసాగుతున్న సంఘర్షణల నేపథ్యంలో అన్ని ప్రదర్శనలు, సదస్సులు, పరిశ్రమ సంబంధిత కార్యక్రమాలు మరియు అవార్డుల వేడుకల నుండి వైదొలుగుతున్నట్లు హమద్ అంతర్జాతీయ విమానాశ్రయం (HIA) ప్రకటించింది. ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేసింది.ఈ కార్యక్రమాలలో 'Skytrax World Airport Awards 2026' మరియు లండన్లో జరగనున్న 'Passenger Terminal Expo 2026' కూడా ఉన్నాయని హమద్ అంతర్జాతీయ విమానాశ్రయం స్పష్టం చేసింది. "మా ప్రయాణికులు, సిబ్బంది మరియు వారి కుటుంబాల భద్రత, శ్రేయస్సే మాకు అత్యంత ప్రాధాన్యతగా ఉంది. భవిష్యత్తులోనూ అదే మా ప్రధాన ప్రాధాన్యతగా కొనసాగుతుంది." అని HIA పేర్కొంది. తమ విమానయాన భాగస్వాములు మరియు సంబంధిత వర్గాల (stakeholders) నుండి లభిస్తున్న నిరంతర మద్దతుకు తాము కృతజ్ఞతలు తెలియజేస్తున్నామని HIA వెల్లడించింది.
తాజా వార్తలు
- ఢిల్లీలో ఘోర అగ్నిప్రమాదం..ఆరుగురు సజీవదహనం!
- తెలంగాణలో 4 రోజులు భారీ వర్షాల హెచ్చరిక
- ఫుజైరాలో విదేశీ మీడియా సంస్థ కోసం వీడియో షూట్..వ్యక్తి అరెస్టు..!!
- అక్రమ ఒబెసిటీ ఆపరేషన్స్..జెడ్డాలోని కేంద్రం సీజ్..!!
- Skytrax అవార్డులు, Expo నుండి వైదొలిగిన హమద్ ఎయిర్ పోర్ట్..!!
- ప్రాంతీయ పరిణామాలపై బహ్రెయిన్, జోర్డాన్ చర్చలు..!!
- ల్యాండ్ పోర్టుల ద్వారా నిరాటకంగా చేపల దిగుమతులు..!!
- వైమానిక దాడిలో ఇరాన్ భద్రతా చీఫ్ మృతి
- పర్యాటకులకు ఇష్టమైన ఈద్ విహార కేంద్రంగా ఒమన్..!!
- ప్రాంతీయ పరిణామాల పై యూఏఈ అధ్యక్షుడు, భారత ప్రధాని చర్చలు..!!









