ఫుజైరాలో విదేశీ మీడియా సంస్థ కోసం వీడియో షూట్..వ్యక్తి అరెస్టు..!!
- March 18, 2026
ఫుజైరా: ఫుజైరా ఎమిరేట్‌లో అధికారిక అనుమతులు పొందకుండా నిషేధిత ప్రాంతాల్లోకి చొరబడి, వీడియో షూట్ చేసిన ఒక వ్యక్తిని అరెస్టు చేశారు. విచారణలో అతను ఒక మీడియా సంస్థలో పనిచేస్తున్నట్లు వెల్లడైందని పోలీసులు తెలిపారు. అయితే, ఈ ప్రదేశాలలోకి ప్రవేశించడానికి లేదా అక్కడ షూట్ చేయడానికి అతనికి ఎటువంటి అధికారిక అనుమతి లేదని వెల్లడించారు.
ఒక విదేశీ మీడియా సంస్థ దుబాయ్ శాఖలో పనిచేస్తున్న ఒక జర్నలిస్టుకు చెందిన అద్దె వాహనంలో అనుమానితుడు ఆ ప్రదేశంలోకి ప్రవేశించాడని పేర్కొన్నారు. నిషేధిత ప్రదేశాల్లోకి ప్రవేశించి, లైసెన్సు లేకుండా షూట్ చేసినందుకు నిందితుడిపై చట్టపరమైన చర్యలు తీసుకోవడానికి వీలుగా పబ్లిక్ ప్రాసిక్యూషన్‌కు అప్పగించినట్లు తెలిపారు.
విచారణలో, నిందితుడు ఆయా ప్రాంతాల్లో మీడియా కంపెనీ గల్ఫ్ ప్రాంతీయ బ్రాంచ్ మేనేజర్ ఆదేశాల మేరకు, రికార్డ్ చేసిన ఫుటేజ్‌ను అధికారిక అనుమతి లేకుండా లండన్‌లోని ఒక వార్తా సంస్థకు ఎలక్ట్రానిక్‌గా పంపినట్లు కూడా విచారణలో వెల్లడైంది. మరే ఇతర చర్యలతో సంబంధం లేకపోయినా, అనుమతి లేకుండా నిషేధిత ప్రాంతాల్లోకి ప్రవేశించడం లేదా అక్కడ ఉండటాన్ని యూఏఈ చట్టాల ప్రకారం నేరమని అధికారులు గుర్తుచేశారు.
ప్రజా భద్రతను కాపాడటానికి సున్నితమైన లేదా నిషేధిత ప్రదేశాలలో, ఎలాంటి వీడియో, ఫోటోల చిత్రీకరణ కార్యకలాపాలు చేపట్టే ముందు చట్టాలు మరియు నిబంధనలను పాటించాలని కోరారు. ముందస్తు అధికారిక అనుమతులు పొందాలని యూఏఈ పబ్లిక్ ప్రాసిక్యూషన్ సూచించింది.
తాజా వార్తలు
- ఢిల్లీలో ఘోర అగ్నిప్రమాదం..ఆరుగురు సజీవదహనం!
- తెలంగాణలో 4 రోజులు భారీ వర్షాల హెచ్చరిక
- ఫుజైరాలో విదేశీ మీడియా సంస్థ కోసం వీడియో షూట్..వ్యక్తి అరెస్టు..!!
- అక్రమ ఒబెసిటీ ఆపరేషన్స్..జెడ్డాలోని కేంద్రం సీజ్..!!
- Skytrax అవార్డులు, Expo నుండి వైదొలిగిన హమద్ ఎయిర్ పోర్ట్..!!
- ప్రాంతీయ పరిణామాలపై బహ్రెయిన్, జోర్డాన్ చర్చలు..!!
- ల్యాండ్ పోర్టుల ద్వారా నిరాటకంగా చేపల దిగుమతులు..!!
- వైమానిక దాడిలో ఇరాన్ భద్రతా చీఫ్ మృతి
- పర్యాటకులకు ఇష్టమైన ఈద్ విహార కేంద్రంగా ఒమన్..!!
- ప్రాంతీయ పరిణామాల పై యూఏఈ అధ్యక్షుడు, భారత ప్రధాని చర్చలు..!!









