ఖతార్ ఆహార భద్రతా వ్యవస్థ పటిష్ఠంగా ఉంది: ఫైసల్ అల్-థానీ

- March 18, 2026 , by Maagulf
ఖతార్ ఆహార భద్రతా వ్యవస్థ పటిష్ఠంగా ఉంది: ఫైసల్ అల్-థానీ

దోహా: కొనసాగుతున్న ప్రాంతీయ పరిణామాల నేపథ్యంలో వస్తువుల లభ్యత, మార్కెట్ల స్థిరత్వం మరియు ఖతార్ ఆహార భద్రతా వ్యవస్థ పటిష్టతకు సంబంధించి వాణిజ్య మరియు పరిశ్రమల శాఖ మంత్రి హెచ్.ఇ.షేక్ ఫైసల్ బిన్ థానీ బిన్ ఫైసల్ అల్-థానీ ఓ ఇంటర్వ్యూలో క్లారిటీ ఇచ్చారు. అన్ని రిటైల్ అవుట్‌లెట్లలో అవసరమైన వస్తువులు తగినంత పరిమాణంలో అందుబాటులో ఉన్నాయని ధృవీకరించారు. 

ముందస్తు సన్నద్ధత కారణంగా ఖతార్ వ్యూహాత్మక కన్జూమర్ గూడ్స్ నిల్వలు సురక్షితమైన మరియు తగినంత స్థాయిలో ఉన్నాయని ఆయన తెలిపారు.  ఈ వ్యూహాత్మక నిల్వల్లో బియ్యం, చక్కెర, గోధుమలు, వంట నూనెలు మరియు ఇతర నిత్యావసర వస్తువులు వంటి కీలక ఆహార పదార్థాలు ఉన్నాయని షేక్ ఫైసల్ తెలిపారు.

ప్రపంచ ఆహార భద్రతా సూచికలో ఖతార్ ప్రపంచవ్యాప్తంగా 30వ స్థానంలో ఉందని, ఇది సవాళ్లను ఎదుర్కోగల ఆహార వ్యవస్థను నిర్మించడంలో జాతీయ విధానాల విజయాన్ని ప్రతిబింబిస్తుందని మంత్రి హైలైట్ చేశారు.

ఆహార వ్యవస్థల సూచికలో ఖతార్ ప్రపంచవ్యాప్తంగా 19వ స్థానంలో ఉందని, ఇది సుస్థిర ఆహార భద్రతను సాధించడంలో సరఫరాల బలాన్ని మరియు జాతీయ ఆహార పర్యావరణ వ్యవస్థ సామర్థ్యాన్ని తెలియజేస్తుందన్నారు. 

పదేళ్ల క్రితం మార్కెట్ మార్పులు మరియు అత్యవసర పరిస్థితులను నిర్వహించడానికి మంత్రిత్వ శాఖ ఒక ఆపరేషన్స్ కేంద్రాన్ని ఏర్పాటు చేసిందని మంత్రి తెలిపారు. ఖతార్ మార్కెట్‌లో నిత్యావసర వస్తువుల లభ్యతను పర్యవేక్షించడం, నిరంతరాయ సరఫరాను నిర్ధారించడం దీని ప్రాథమిక విధి అని, ఇందులో 300 మందికి పైగా తనిఖీ ఇన్‌స్పెక్టర్లు ఉన్నారని పేర్కొన్నారు.

మంత్రిత్వ శాఖ ఎలాంటి ఉల్లంఘనలను, ముఖ్యంగా ధరల తారుమారు లేదా వినియోగదారుల దోపిడీని సహించదని, తప్పు చేసిన ఏ సంస్థలపైనైనా చట్టపరమైన చర్యలు తీసుకుంటామని మంత్రి స్పష్టం చేశారు.

హోర్ముజ్ జలసంధి మూసివేత లేదా ప్రపంచ షిప్పింగ్ మార్గాలకు అంతరాయాలు వంటి ప్రమాదాలను ఎదుర్కోవడానికి, దశాబ్దానికి పైగా మంత్రిత్వ శాఖ ప్రణాళికలను రూపొందించిందని ఆయన అన్నారు.

ప్రస్తుత పరిస్థితి ప్రారంభమైన వెంటనే ప్రత్యామ్నాయ లాజిస్టిక్స్ మార్గాలపై ఫోకస్ పెట్టామని, నిరంతర సరఫరాను నిర్ధారించడానికి ప్రభుత్వ సంస్థలు మరియు ప్రైవేట్ రంగంతో సమన్వయంతో 24 గంటలూ పనిచేసే మంత్రిత్వ శాఖ ఎమర్జెన్సీ ఆపరేషన్ రూమ్ ను ప్రారంభించినట్లు షేక్ ఫైసల్ తెలిపారు.

ఖతార్ ఎయిర్‌వేస్‌తో సమన్వయంతో నిత్యావసర వస్తువుల అత్యవసర విమాన రవాణాకు ఏర్పాట్లు చేశామన్నారు. ఇప్పటివరకు 300 టన్నులకు పైగా విమానాల ద్వారా అత్యవసర నిల్వలు ఖతార్‌కు చేరిందని, దీనిని 1,000 టన్నులకు పెంచే ప్రణాళికలు ఉన్నాయని, తద్వారా సరఫరా లభ్యతను మరింత బలోపేతం చేస్తామని ఆయన అన్నారు.

స్థానిక మార్కెట్‌కు సరఫరా చేయడానికి సమర్థవంతంగా పనిచేస్తున్న 138 కంటే ఎక్కువ జాతీయ ఆహార కర్మాగారాలు ఇప్పుడు ఖతార్ పారిశ్రామిక రంగంలో ఉన్నాయని ఆయన అన్నారు.

వినియోగదారులు 16001 హాట్‌లైన్ ద్వారా లేదా మంత్రిత్వ శాఖ యొక్క డిజిటల్ ప్లాట్‌ఫారమ్‌ల ద్వారా ఉల్లంఘనలను నివేదించాలని ఆయన పిలుపునిచ్చారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com