IPL-2026: సన్‌రైజర్స్ కొత్త కెప్టెన్‌గా ఇషాన్ కిషన్
- March 18, 2026
హైదరాబాద్ సన్ రైజర్స్ జట్టు కొత్త కెప్టెన్‌ను యాజమాన్యం ప్రకటించింది. ఐపీఎల్-2026 సీజన్ ప్రారంభానికి ముందే నిర్ణయం తీసుకుంది. జట్టు రెగ్యులర్ కెప్టెన్ పాట్ కమిన్స్ (Pat Cummins) వెన్నునొప్పి గాయంతో బాధపడుతుండటంతో, అతడి స్థానంలో యువ వికెట్ కీపర్ బ్యాటర్ ఇషాన్ కిషన్‌ను తాత్కాలిక కెప్టెన్‌గా నియమించింది. అయితే, పాట్ కమిన్స్ అందుబాటులోకి వచ్చే వరకు ఇషాన్ కిషన్ జట్టును నడిపించనున్నారు.
డ్యాషింగ్ ఓపెనర్ అభిషేక్ శర్మకు వైస్ కెప్టెన్‌గా బాధ్యతలు అప్పగించారు. ఈ ఇద్దరు యువ ఆటగాళ్లు జట్టును ముందుండి నడిపించనున్నారు. ప్రస్తుతం వెన్నునొప్పి కారణంగా తన స్వదేశంలో వైద్యలు పర్యవేక్షణలో ప్యాట్ కమిన్స్ ప్రస్తుతం విశ్రాంతి తీసుకుంటున్నారు. అతను పూర్తిగా కోలుకున్న తర్వాతే జట్టులో చేరుతారని మేనేజ్మెంట్ స్పష్టం చేసింది. కాగా, ఈ నెల 28న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB)తో జరిగే తొలి పోరులో సన్‌రైజర్స్ ఆర్మీని ఇషాన్ కిషన్ నడిపించనున్నారు. యువ ఆటగాళ్లకు కీలక బాధ్యతలు అప్పగించడం ద్వారా ఎస్ఆర్హెచ్ కొత్త వ్యూహంతో బరిలోకి దిగుతోంది. ఇషాన్ కిషన్ దూకుడైన కెప్టెన్సీ జట్టుకు ఎంతవరకు కలిసి వస్తుందో లేదో వెయిట్ చేయాల్సిందే మరి.
తాజా వార్తలు
- IPL-2026: సన్‌రైజర్స్ కొత్త కెప్టెన్‌గా ఇషాన్ కిషన్
- సగటు తలసరి ఇంటర్నెట్ డేటా వినియోగం గురించి లోక్ సభ లో ప్రశ్నించిన ఎంపీ బాలశౌరి
- దుబాయ్ విమానయాన రంగం పునరుద్ధరణ పై సీఈఓ పాల్ గ్రిఫిత్స్ ధీమా!
- వాతావరణంలో రేడియేషన్ స్థాయిలపై కువైట్ క్లారిటీ..!!
- అల్పపీడన ద్రోణి..ఒమన్ వ్యాప్తంగా వర్షాలు..!!
- ప్రాంతీయ భద్రతపై రియాద్ లో కీలక సమావేశం..!!
- కువైట్ లో మార్చి 20న ఈద్ అల్-ఫితర్..!!
- ఖతార్ ఆహార భద్రతా వ్యవస్థ పటిష్ఠంగా ఉంది: ఫైసల్ అల్-థానీ
- ఈద్ అల్ ఫితర్: అబుదాబిలో 4 రోజుల పాటు ఉచిత పార్కింగ్..!!
- సున్నితమైన ఫోటోలు ఆన్లైన్లో పోస్ట్..కేసు నమోదు..!!









