తెలంగాణ కల్చరల్ సొసైటీ ఆధ్వర్యంలో ఘనంగా ఉగాది వేడుకలు
- March 20, 2026
సింగపూర్: తెలంగాణ కల్చరల్ సొసైటీ, సింగపూర్ (TCSS) ఆధ్వర్యంలో పరాభవ నామ సంవత్సర ఉగాది వేడుకలు ఇక్కడి పోటోన్గ్ పాసిర్ లోని శ్రీ శివ దుర్గ ఆలయంలో మార్చి 19 న ఎంతో ఘనంగా జరిగాయి. శ్రీ పరాభవ నామ సంవత్సరంలో అందరికి మంచి జరగాలని ఉగాది పర్వదినాన సొసైటీ సభ్యులు ప్రత్యేక పూజలు చేయడం జరిగింది. వేడుకల్లో బాగంగా పేరి కృష్ణ శర్మ పంచాంగ శ్రవణం చేశారు. ఆ తరువాత ప్రత్యేకంగా వ్రాయించిన గంటల పంచాంగాన్ని సభ్యులకు అందజేయడం జరిగింది. ఈ గంటల పంచాంగాన్ని ప్రముఖ పంచాంగ కర్తలు పండిత బుట్టే వీరభద్ర దైవజ్ఞ (శ్రీ శ్రీశైల దేవస్థాన ఆస్థాన సిద్ధాంతి) గారు సిద్ధం చేయడం జరిగింది.ఈ వేడుకల్లో 300 మంది పైగా ప్రవాస తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ వాసులు పాల్గొన్నారు. వేడుకల్లో పాల్గొన్న వారందరికి సాంప్రదాయ ఉగాది పచ్చడి,పులిహోర, దద్దోజనం మొదలగు ప్రసాదం పంపిణి చేయడం జరిగింది.ఎలాంటి లాభాపేక్ష లేకుండా తెలంగాణ కల్చరల్ సొసైటీ వారు చేస్తున్న కార్యక్రమాలు స్ఫూర్తి దాయకం అని వేడుకల్లో పాల్గొన్న భక్తులు కొనియాడారు.
ఈ కార్యక్రమానికి సమన్వయ కర్తలుగా ప్రాంతీయ కార్యదర్శులు సంతోష్ వర్మ మాదారపు, భాస్కర్ నడికట్ల, శశిధర్ ఎర్రమ రెడ్డి, ఉపాధ్యక్షులు నల్ల భాస్కర్, దుర్గ ప్రసాద్ , సంతోష్ కుమార్ జూలూరి మరియు ప్రశాంత్ బసిక, ఉపాధ్యక్షురాలు సునీత రెడ్డి మిర్యాల, ప్రధాన కార్యదర్శి బొందుగుల రాము మరియు కార్యవర్గ సభ్యులు పెరుకు శివ రామ్ ప్రసాద్ మొదలగు వారు ఉన్నారు.
ఉగాది వేడుకలు విజయవంతంగా జరుగుటకు మరియు ప్రసాదానికి సహాయం అందించిన దాతలకు, స్పాన్సర్స్ కు మరియు సంబరాల్లో పాల్గొన్న ప్రతీ ఒక్కరికి TCSS అధ్యక్షులు గడప రమేష్ బాబు, ప్రధాన కార్యదర్శి బొందుగుల రాము, కోశాధికారి నంగునూరి వెంకటరమణ, సంస్థాగత కార్యదర్శి కాసర్ల శ్రీనివాస రావు, ప్రాంతీయ కార్యదర్శులు బొడ్ల రోజా రమణి, రవి కృష్ణ విజాపూర్ మరియు కార్యవర్గ సభ్యులు శివ ప్రసాద్ ఆవుల, భాస్కర్ రావు పులిగిళ్ల, విజయ మోహన్ వెంగళ, ప్రవీణ్ మామిడాల, సతీష్ పెసరు, మణికంఠ రెడ్డి, రావుల సుగుణాకర్ రెడ్డి మరియు చల్ల కృష్ణ మొదలగు వారు భక్తులందరికీ ధన్యవాదాలు తెలిపారు.
ముఖ్యంగా ఈ వేడుకలు ఘనంగా జరగడానికి చేయూతనందించిన మై హోమ్ బిల్డర్స్, కుమార్ ప్రాపర్టీస్ (ప్రాప్నెక్స్) సింగపూర్, ASBL కన్స్ట్రక్షన్ కంపెనీ, సరిగమ గ్రాండ్ ఇండియన్ రెస్టారెంట్, వజ్రా రియల్ ఎస్టేట్ కన్స్ట్రక్షన్ అండ్ డెవలప్మెంట్ కంపెనీ, ఏపీజే అభిరామి, ఏపీజే జువెల్లర్స్ ప్రైవేట్ లిమిటెడ్, ఎవోల్వ్, ఏ వి ఏం కన్స్ట్రక్షన్ అండ్ ఇంజనీరింగ్ ప్రైవేట్ లిమిటెడ్ మరియు సౌజన్య డెకార్స్ గార్లకు సొసైటీ సభ్యులు కృతజ్ఞతలు తెలియజేశారు.
ఈ వేడుకలకు ఆర్థిక సహకారం అందించిన నాగులపల్లి శ్రీనివాస్ ,డెలీసియస్ బిర్యాని బై ఫీస్ట్రో, నండూరి సునీత మరియు మహేష్ చెట్టిపెల్లి గార్లకు సొసైటీ సభ్యులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు.

తాజా వార్తలు
- భారతీయ పర్యాటకులకు ఉచిత యూఏఈ వీసా..అబుదాబి కొత్త హాలిడే ఆఫర్
- టీటీఈలకు బాడీ కెమెరాలు: రైల్వేలో కొత్త శకం
- ఆన్లైన్లో ఈ పనులు చేస్తే జైలుశిక్ష.. Dh500,000 ఫైన్..!!
- నిబంధనలు ఉల్లంఘించిన కార్ల డీలర్‌కు భారీ జరిమానా.. లైసెన్స్ సస్పెన్షన్..!!
- రసాయన పరిశ్రమల్లో అగ్ని ప్రమాదాలపై సీడీఏఏ భద్రతా సూచనలు..!!
- ‘రిపోర్ట్ మీ’ ఫిర్యాదుల వివరాలు గోప్యమే.. పీఏఎం హామీ..!!
- ఘనంగా హాంగ్‌కాంగ్‌లో 27వ కార్గిల్ విజయ్ దివస్
- ఉదయం 7 గంటలకు ముందు.. రాత్రి 8 తర్వాత డ్రిల్లింగ్కు నో..!!
- ఖతార్‌లో విదేశీ పెట్టుబడులు భారీగా పెరుగుదల..!!
- బహ్రెయిన్–యూఏఈ మధ్య ‘వన్ స్టాప్’ ఎయిర్ ట్రావెల్ సిస్టమ్..







