109 మందిని అరెస్టు చేసిన అబుదాబి పోలీసులు..!!
- March 20, 2026
అబుదాబి: ఈవెంట్లను ఫోటో, వీడియోలు తీసి తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేసినందుకు 109 మందిని అబుదాబి పోలీసులు అరెస్టు చేశారు.అరెస్ట్ అయిన వారు వెబ్‌సైట్‌లను, ఈవెంట్‌లను చిత్రీకరిస్తూ, సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌ల ద్వారా తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేస్తున్నారని ప్రకటించారు.
ఈ తప్పుడు సమాచారం ప్రజల అభిప్రాయాన్ని రెచ్చగొట్టడంతో పాటు, కమ్యూనిటీ సభ్యులలో పుకార్లను వ్యాప్తి చేస్తుందని పేర్కొన్నారు. సోషల్ మీడియా దుర్వినియోగానికి సంబంధించిన ఉల్లంఘనలను పర్యవేక్షించడానికి మరియు గుర్తించడానికి భద్రతా దళాలు చేస్తున్న నిరంతర ప్రయత్నాలలో భాగంగా, అబుదాబి పోలీసులు తమ వంతుగా చర్యలు తీసుకున్నట్లు తెలిపారు.
ఇటువంటి ప్రవర్తనలు స్థానిక చట్టాలు మరియు నిబంధనలను ఉల్లంఘించడమేనని తెలిపారు. అధికారులు విడుదల చేయని ఏ ఇతర కంటెంట్‌ను ప్రచురించడం లేదా వాటిని షేర్ చేయడం వంటివి చేయరాదని కోరారు.ఇలాంటివి సమాజ భద్రతపై ప్రతికూల ప్రభావం చూపుతుందని వెల్లడించారు.
ప్రజలు కేవలం అధికారిక వనరుల నుండి మాత్రమే సమాచారాన్ని పొందాలని, ప్రజా ప్రయోజనాలను పరిరక్షించడానికి, కార్యక్రమ స్థలాలను లేదా సంబంధిత క్లిప్‌లను ఫోటో తీయడం లేదా ప్రచురించడం చేయరాదని సూచించారు.
--శ్రీనివాస్(మాగల్ఫ్ ప్రతినిధి)
తాజా వార్తలు
- అజ్మాన్ రోడ్డు ప్రమాదంలో కాలు కోల్పోయిన భారతీయుడికి Dh650,000 పరిహారం
- కెప్టెన్ స్మిత్ మచ్చర్‌కు గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా ప్రశంసలు
- సౌదీ అరేబియా జెడ్డాలో 11వ ఆయుర్వేద దినోత్సవం ఘనంగా నిర్వహణ
- పైలట్ కెప్టెన్ స్మిత్ కు గుజరాత్ గరిమా అవార్డు.. సీఎం భూపేంద్ర పటేల్ ప్రకటన
- ఒమన్‌లో 3.4% పెరిగిన ఆరోగ్య సంస్థలు..!!
- వృద్ధుల హెల్త్ చెకప్స్.. బహ్రెయిన్ ఎంపీ కీలక ప్రతిపాదనలు..!!
- యూఏఈలో కొత్త ప్రయాణ ప్రత్యామ్నాయంగా ఎతిహాద్ రైలు..!!
- ఖతార్ లో ప్లాంట్ 10 మిలియన్ ట్రీస్ ప్రాజెక్టులో భారీ పురోగతి..!!
- సౌదీలో పార్కింగ్‌పై కొత్త నిబంధనలు..!!
- కువైట్‌లో నిర్మాణ వ్యర్థాలు.. ఓనర్లకు కీలక సూచనలు..!!







