SATA జెద్దా–ఉగాది & ఈద్ వేడుకలు ఘనంగా నిర్వహణ
- March 21, 2026
సౌదీ అరేబియా: సౌదీ అరేబియాలోని జెద్దా నగరంలో సౌదీ అరేబియా తెలుగు సంఘం (SATA) ఆధ్వర్యంలో ఉగాది & ఈద్ వేడుకలు ఎంతో వైభవంగా, ఆనందోత్సాహాలతో నిర్వహించబడ్డాయి.
విదేశాల్లో నివసిస్తున్న భారతీయులమైన మనకు మన సంస్కృతి, సంప్రదాయాలను గుర్తుచేసే ఈ వేడుకలు ప్రతి ఒక్కరికీ ఆత్మీయ అనుభూతిని కలిగించాయి. కుటుంబ సభ్యులు, పిల్లలు, యువత కలిసి ఒకటిగా పాల్గొని ఉగాది పండుగను సాంప్రదాయబద్ధంగా జరుపుకున్నారు.
ఈ కార్యక్రమంలో భాగంగా నిర్వహించిన ముఖ్య ఆకర్షణలు:
సాంస్కృతిక కార్యక్రమాలు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. గోపి, హరోన్, అంజడ్ మరియు ఈ మధ్యనే దుబాయ్ నుండి వచ్చిన బాలు మరియు ప్రియల గానం, సభీకుల్ని మంత్ర ముగ్ధుల్ని చేసింది.
వినోద కార్యక్రమాలు అందరికీ ఉత్సాహాన్ని నింపాయి.సమాజ ఐక్యతను ప్రతిబింబించే కార్యక్రమాలు ప్రత్యేకంగా నిలిచాయి. ప్రేరణాత్మక సందేశాలు అందరికీ ఉత్తేజాన్ని ఇచ్చాయి
ఈ వేడుకలు కేవలం పండుగకే పరిమితం కాకుండా, జెద్దాలోని తెలుగు సమాజాన్ని మరింత దగ్గర చేసేందుకు, ఐక్యతను బలోపేతం చేసేందుకు వేదికగా నిలిచాయి అంటూ అందరికీ శుభాకాంక్షలు తెలియజేసిన గ్లోబల్ తెలుగు జిడ్డ ప్రెసిడెంట్, అనంతపురం కు చెందిన షోకత్ అలీ.
ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి SATA హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తోంది. నిర్వాహకులు, వాలంటీర్లు, స్పాన్సర్లు మరియు పాల్గొన్న ప్రతి ఒక్కరి సహకారం ఈ వేడుకను మరింత ప్రత్యేకంగా మార్చింది అని తెలియ చేసిన సాటా జిడ్డ అధ్యక్షుడు, వరంగల్ వాస్తవ్యుడు అంజాద్ బైగ్.
ఉగాది సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ, కొత్త సంవత్సరంలో ఆరోగ్యం, ఆనందం, విజయాలు కలగాలని ఆకాంక్షిస్తున్నాము అని తెలియ చేసిన సౌదీ ప్రీమియం రెసిడెన్సీ, తెలుగు ప్రముఖుడు డా.నాగరాజు మరియు సతీమణి లక్ష్మీ.
ఇటువంటి సాంస్కృతిక కార్యక్రమాలు దేశంలో తెలుగు వ్యవస్థ బలోపేతానికి ఉపయోగపడతాయి అంటూ ఈ వారంలో అభా, యాంభూ, రియాద్ మరియు దమంలో కూడా ఉగాది సంబరాలకు ఏర్పాట్లు జరుగుతున్నాయి అని తెలియచేసిన
సాటా వ్యవస్థాపక అధ్యక్షుడు మల్లేశం.



తాజా వార్తలు
- హైదరాబాద్-బెంగళూరు హైవేపై కీలక నిర్ణయం. 6 వరుసలకు విస్తరణ
- ట్రంప్ ప్రభుత్వం కీలక నిర్ణయం..1.75 లక్షల వీసాలు రద్దు
- భారతీయుడిని తరలించిన ఒమన్ రాయల్ ఎయిర్‌ఫోర్స్..!!
- సౌదీలో 27,360 షెవర్లే కార్ల రీకాల్.. ఎయిర్‌బ్యాగ్ లో లోపం..!!
- కొలంబియాను వణికించిన భూకంపం..132కి పెరిగిన మృతుల సంఖ్య
- కార్ల అద్దాలకు 50 శాతం వరకు టింట్ అనుమతించాలని ప్రతిపాదన..!!
- కువైట్‌లో ప్రవాసులకు కీలక హెచ్చరిక.. కమర్షియల్ కన్సీల్మెంట్పై కఠిన నిబంధనలు..!!
- ‘ఇన్‌స్టా పేరెంటింగ్’తో పిల్లలకు ముప్పు.. యూఏఈ వైద్యుల హెచ్చరిక..!!
- రాత్రివేళ లైట్లు లేకుండా డ్రైవింగ్ చేస్తే QR10,000 వరకు జరిమానా..!!
- 1601 సిరీస్ నంబర్లను అందుబాటులోకి తెచ్చిన TRAI..!







