ఫ్యామిలీ డెంటల్ ప్యాకేజీలు ప్రారంభించిన మెడికవర్ హాస్పిటల్స్
- March 21, 2026
హైదరాబాద్: ప్రపంచ మౌఖిక ఆరోగ్య దినోత్సవాన్ని పురస్కరించుకుని హైటెక్ సిటీలోని మెడికవర్ హాస్పిటల్స్ ప్రత్యేక దంత ఆరోగ్య అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించింది.
“Smile Brighter This Summer” అనే థీమ్‌తో కుటుంబ సభ్యుల కోసం ప్రత్యేక డెంటల్ ప్యాకేజీలు, అలాగే సీనియర్ సిటిజన్స్ కోసం ఉచిత దంత పరీక్ష కార్యక్రమాన్ని ప్రారంభించారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ప్రముఖ నటి నభా నటేష్, ప్రముఖ నటుడు రాజా రవీంద్రతో పాటు డా.ఎ.శరత్ రెడ్డి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ & సీనియర్ ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్ట్, పి.హరికృష్ణ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ మెడికవర్ హాస్పిటల్స్ ఇండియా చేతుల మీదుగా కార్యక్రమాన్ని ప్రారంభించారు.
ఈ సందర్భంగా ప్రారంభించిన సీనియర్ సిటిజన్స్ కోసం ఏప్రిల్ 15, 2026 వరకు ఉచిత డెంటల్ చెకప్ సౌకర్యాన్ని ప్రకటించారు.
అదేవిధంగా సమ్మర్ స్పెషల్ ఫ్యామిలీ డెంటల్ ప్యాకేజ్లో కుటుంబ సభ్యులకు డెంటల్ కన్సల్టేషన్, డిజిటల్ OPG ఎక్స్-రే సౌకర్యం, అలాగే అన్ని డెంటల్ ట్రీట్మెంట్స్‌పై 30 శాతం తగ్గింపు అందిస్తున్నారు.
ఈ ప్యాకేజ్‌ను ప్రత్యేక రాయితీ ధర రూ.1999/-కు అందుబాటులో ఉంచారు.ఈ ఆఫర్ జూన్ 30, 2026 వరకు చెల్లుబాటులో ఉంటుంది.
ఈ సందర్భంగా వైద్య నిపుణులు డా. సి. శరత్ బాబు, ప్రోస్థోడాంటిస్ట్ & ఇంప్లాంటాలజిస్ట్ మాట్లాడుతు, నోటి ఆరోగ్యం మొత్తం శరీర ఆరోగ్యానికి ఎంతో కీలకమని, పళ్ళు మరియు దంతాల సంరక్షణ ద్వారా అనేక వ్యాధులను ముందుగానే నివారించవచ్చని తెలిపారు. ముఖ్యంగా వేసవి కాలంలో సరైన మౌఖిక పరిశుభ్రత పాటించడం అత్యంత అవసరమని సూచించారు.
ఈ కార్యక్రమంలో మహేష్ డెగ్లూర్కర్ చీఫ్ బిజినెస్ ఆఫీసర్ మెడికవర్ హాస్పిటల్స్ మరియు వైద్య నిపుణులు పాల్గొన్నారు.
తాజా వార్తలు
- అజ్మాన్ రోడ్డు ప్రమాదంలో కాలు కోల్పోయిన భారతీయుడికి Dh650,000 పరిహారం
- కెప్టెన్ స్మిత్ మచ్చర్‌కు గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా ప్రశంసలు
- సౌదీ అరేబియా జెడ్డాలో 11వ ఆయుర్వేద దినోత్సవం ఘనంగా నిర్వహణ
- పైలట్ కెప్టెన్ స్మిత్ కు గుజరాత్ గరిమా అవార్డు.. సీఎం భూపేంద్ర పటేల్ ప్రకటన
- ఒమన్‌లో 3.4% పెరిగిన ఆరోగ్య సంస్థలు..!!
- వృద్ధుల హెల్త్ చెకప్స్.. బహ్రెయిన్ ఎంపీ కీలక ప్రతిపాదనలు..!!
- యూఏఈలో కొత్త ప్రయాణ ప్రత్యామ్నాయంగా ఎతిహాద్ రైలు..!!
- ఖతార్ లో ప్లాంట్ 10 మిలియన్ ట్రీస్ ప్రాజెక్టులో భారీ పురోగతి..!!
- సౌదీలో పార్కింగ్‌పై కొత్త నిబంధనలు..!!
- కువైట్‌లో నిర్మాణ వ్యర్థాలు.. ఓనర్లకు కీలక సూచనలు..!!







