యూఏఈలో అస్థిర వాతావరణం..అబుదాబి, దుబాయ్‌లలో వర్షాలు..!!
- March 21, 2026
యూఏఈ: యూఏఈలో అల్పపీడన వ్యవస్థ కారణంగా మార్చి 27 వరకు అస్థిర వాతావరణ పరిస్థితులు కొనసాగుతాయని జాతీయ వాతావరణ కేంద్రం (NCM) తెలిపింది. దీని ప్రభావంతో వివిధ ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయని పేర్కొంది. ఆకాశం పాక్షికంగా మేఘావృతమై, కొన్ని ప్రాంతాలలో వర్షపాతం నమోదవుతోందన్నారు.
రాత్రి 8 గంటల నుండి 10 గంటల మధ్య దుమ్ము, ఇసుకను లేపే బలమైన గాలుల కారణంగా హారిజెంట్ విజిబిలిటీ తగ్గే అవకాశం ఉందని హెచ్చరిస్తూ, NCM ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ఈ సందర్భంగా దేశంలోని వివిధ ప్రాంతాలలో కురుస్తున్న వర్షాలను చూపిస్తున్న వీడియోలు ఆన్లైన్లో పోస్ట్ చేసింది.
దుబాయ్ లో..
దుబాయ్ లో వర్షం దంచికొడుతోంది. వీధులు, రహదారులు పూర్తిగా తడిసిముద్దయ్యాయి. దిబ్బా, ఫుజైరా మరియు తూర్పు ప్రాంతాలపై భారీ వర్షాలు కురుస్తున్నాయి. షార్జాలో కుండపోత వర్షం కురుస్తోంది. ఈ ఆహ్లాదకరమైన వర్షంలో ప్రజలు తిరుగుతూ, పవిత్రమైన ఈద్ పండుగను జరుపుకుంటున్నారు.
NCM ప్రకారం, యూఏఈ వ్యాప్తంగా నివాసితులు ఒక వారం పాటు అస్థిర వాతావరణాన్ని ఎదుర్కోనున్నారు. కొన్ని ప్రాంతాలలో వర్షం, ఉరుములతో కూడిన తుఫానులు, వడగళ్ల వాన పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది.
అస్థిర వాతావరణ పరిస్థితులలో అప్రమత్తంగా ఉండాలని, భద్రతా మార్గదర్శకాలను పాటించాలని అధికారులు నివాసితులను కోరారు. అస్థిర వాతావరణ పరిస్థితులలో ట్రాఫిక్ నియమాలను పాటించాలని, జాగ్రత్తగా వాహనాలు నడపాలని రోడ్ల రవాణా సంస్థ (RTA) నివాసితులకు సూచించింది.
అబుదాబి లో..
అస్థిర వాతావరణంలో ముందుజాగ్రత్త చర్యగా వేగ పరిమితును తగ్గించినట్లు అబుదాబి పోలీసులు తెలిపారు. అల్ ష్వైబ్ రోడ్డు (అల్ ఖుదార్ వంతెన - అల్ ష్వైబ్ వంతెన)పై గంటకు 100 కిలోమీటర్ల వేగ పరిమితి వ్యవస్థను ప్రారంభించినట్లు పేర్కొన్నది.
అబుదాబి వ్యాప్తంగా డ్రైవర్లు బయలుదేరే ముందు పరిస్థితులను తనిఖీ చేసుకోవాలని, నీటి వనరులు లేదా లోయల సమీపంలో అప్రమత్తంగా ఉండాలని, ట్రాఫిక్ మార్గదర్శకాలను పాటించాలని మరియు డ్రైవింగ్ విన్యాసాలకు దూరంగా ఉండాలని సూచించారు.
షార్జా పోలీసులు కూడా పలు సూచనలు జారీ చేశారు. సురక్షితమైన వాహన దూరాన్ని పాటించాలని, వేగాన్ని తగ్గించాలని, జాగ్రత్తగా డ్రైవింగ్ చేయాలని మరియు లోయలు, ఆనకట్టలకు దూరంగా ఉండాలని కోరారు.
తాజా వార్తలు
- అజ్మాన్ రోడ్డు ప్రమాదంలో కాలు కోల్పోయిన భారతీయుడికి Dh650,000 పరిహారం
- కెప్టెన్ స్మిత్ మచ్చర్‌కు గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా ప్రశంసలు
- సౌదీ అరేబియా జెడ్డాలో 11వ ఆయుర్వేద దినోత్సవం ఘనంగా నిర్వహణ
- పైలట్ కెప్టెన్ స్మిత్ కు గుజరాత్ గరిమా అవార్డు.. సీఎం భూపేంద్ర పటేల్ ప్రకటన
- ఒమన్‌లో 3.4% పెరిగిన ఆరోగ్య సంస్థలు..!!
- వృద్ధుల హెల్త్ చెకప్స్.. బహ్రెయిన్ ఎంపీ కీలక ప్రతిపాదనలు..!!
- యూఏఈలో కొత్త ప్రయాణ ప్రత్యామ్నాయంగా ఎతిహాద్ రైలు..!!
- ఖతార్ లో ప్లాంట్ 10 మిలియన్ ట్రీస్ ప్రాజెక్టులో భారీ పురోగతి..!!
- సౌదీలో పార్కింగ్‌పై కొత్త నిబంధనలు..!!
- కువైట్‌లో నిర్మాణ వ్యర్థాలు.. ఓనర్లకు కీలక సూచనలు..!!







