నువైసీబ్ బార్డర్ నుంచి కువైట్ ఎయిర్‌వేస్‌కు ఫాస్ట్-ట్రాక్ రూట్..!!
- March 24, 2026
కువైట్ః కువైట్ ఎయిర్‌వేస్ విమానాల కోసం నువైసీబ్ సరిహద్దు క్రాసింగ్ ద్వారా ఒక ప్రత్యేక మార్గాన్ని కేటాయించినట్లు కువైట్ జనరల్ అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ కస్టమ్స్ ప్రకటించింది. ఈ మేరకు డైరెక్టర్ జనరల్ సాద్ అల్-నువైఫ్ ఒక ప్రకటన విడుదల చేశారు. పరిశోధన, దర్యాప్తు మరియు కస్టమ్స్ పోర్ట్స్ వ్యవహారాల డిప్యూటీ డైరెక్టర్ సలేహ్ అల్-ఒమర్‌తో కలిసి నువైసీబ్ బార్డర్ లో క్షేత్రస్థాయి తనిఖీ పర్యటన సందర్భంగా ఈ మేరకు నిర్ణయించినట్లు కస్టమ్స్ విభాగం తెలిపింది.
కువైట్ ఎయిర్‌వేస్‌తో సమన్వయంతో ఈ ప్రత్యేక మార్గాన్ని ప్రవేశపెట్టినట్లు అల్-నువైఫ్ తెలిపారు. ఇది ఉత్తమ కార్యాచరణ ప్రమాణాలకు అనుగుణంగా, నిర్దేశిత ఫాస్ట్-ట్రాక్ వ్యవస్థ ద్వారా సరుకులు మరియు వాహనాల వేగవంతమైన రవాణాకు కూడా తోడ్పడుతుందని అన్నారు. ట్రక్కులు మరియు సరుకుల ప్రవేశాన్ని క్రమబద్ధీకరించడానికి, నిరీక్షణ సమయాలను తగ్గించడానికి, మరియు వాణిజ్య రవాణా ప్రవాహ సామర్థ్యాన్ని మెరుగుపరచడానికి అ పాస్ట్ ట్రాక్ రూట్ ఉపయోగపడుతుందని తెలిపారు.
తాజా వార్తలు
- యూఏఈలో అక్టోబర్ నుంచి అధిక వర్షాలు?
- సౌదీ అరేబియాలో వడ్డీ రేట్లు పెంపు..!!
- హోర్ముజ్ జలసంధి పరిస్థితిపై ఒమన్ కీలక ప్రకటన..!!
- కువైట్‌లో డ్రోన్లపై మరోసారి హెచ్చరిక జారీ..!!
- బహ్రెయిన్‌లో ఆలీ వాక్‌వేకు కొత్త రూపు..!!
- ఖతార్‌లో కీలక వడ్డీ రేట్లు పెంపు..!!
- గ్లోబల్ విలేజ్ సీజన్ 31 VIP ప్యాక్స్ విక్రయ తేదీలు వెల్లడి
- TGSRTC సంచలన నిర్ణయం..
- ఎయిర్ ఇండియా, ఉజ్బెకిస్థాన్ ఎయిర్‌వేస్‌తో ఫ్లైడుబాయ్ కొత్త భాగస్వామ్యాలు
- జనవరి 14 నుంచి ఉమెన్స్ ప్రీమియర్ లీగ్(WPL) ఐదో సీజన్.. !







