కువైట్ లో విద్యుత్ సరఫరాలో అంతరాయాలు నమోదు..!!
- March 24, 2026
కువైట్: కువైట్ లో పలు ప్రాంతాల్లోని ఏడు ఓవర్‌హెడ్ విద్యుత్ ప్రసార లైన్లు సేవలకు దూరమయ్యాయని విద్యుత్, జల మరియు పునరుత్పాదక ఇంధన మంత్రిత్వ శాఖ ప్రకటించింది. వైమానిక రక్షణ నిరోధక చర్యల కారణంగా పడిన శిథిలాల వల్ల ఈ ఘటనలు జరిగాయని తెలిపింది.
కొన్ని ప్రాంతాల్లో పాక్షిక విద్యుత్ అంతరాయాలు నమోదయ్యాయని, అత్యవసర రెస్పాన్స్ టీమ్స్ పరిస్థితిను పర్యవేక్షించాయని, వెంటనే విద్యుత్‌ను పునరుద్ధరించామని అధికార ప్రతినిధి, ఇంజనీర్ ఫాతిమా జవహర్ హయత్ ఒక ప్రకటనలో తెలిపారు.
విద్యుత్ నెట్‌వర్క్‌లో తలెత్తే సమస్యల పరిష్కారానికి, నిరంతర సేవలను అందించేందుకు అత్యవసర బృందాలు నిరంతరం పనిచేస్తున్నాయని హయత్ చెప్పారు. అధికార వర్గాల నుంచి వచ్చే సమాచారాన్ని మాత్రమే విశ్వసించాలని కోరారు.
తాజా వార్తలు
- విదేశీ విద్యార్థులకు US కొత్త రూల్స్..!
- ఇరాన్ కొనసాగిస్తున్న దాడులు.. కువైట్‌పై క్షిపణులు, డ్రోన్లను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- ఇరాన్ పై అమెరికా వరుసగా 10వ రాత్రి దాడులు..
- నిరాహార దీక్ష ఆపేది లేదు–సోనమ్ వాంగుక్ ప్రకటన
- ఇరాన్ దాడుల ప్రభావం.. బహ్రెయిన్, కువైట్, ఖతార్ విమానాలకు అంతరాయం
- ఏపీ విద్యార్థులకు సర్కార్ గుడ్ న్యూస్..
- డీజీపీ సీవీ ఆనంద్ ని కలిసిన క్రికెటర్ మహమ్మద్ సిరాజ్
- సెప్టెంబర్‌లో ప్రారంభం కాబోతున్న బిగ్ బాస్ సీజన్ 10
- బహ్రెయిన్ వైమానిక నావిగేషన్ పరికరాలే లక్ష్యం..అయినా విమాన రాకపోకలకు అంతరాయం లేదు
- ఢిల్లీ ఘటన పై తెలంగాణ సీఎం రేవంత్ ఫైర్..







