వరల్డ్ హ్యాపినెస్ రిపోర్టు.. 22వ స్థానంలో సౌదీ అరేబియా..!!
- March 25, 2026
ఆక్స్‌ఫర్డ్: ప్రపంచ సంతోష నివేదిక 2026లో 10కి గాను 6.817 లైఫ్ ఇవాల్యుయేషన్ స్కోరుతో సౌదీ అరేబియా 147 దేశాలలో 22వ స్థానంలో నిలిచింది. ఈ నివేదికను ఆక్స్ ఫర్డ్ విశ్వవిద్యాలయంలోని వెల్‌బీయింగ్ రీసెర్చ్ సెంటర్, గ్యాలప్ మరియు ఐక్యరాజ్యసమితి సుస్థిర అభివృద్ధి పరిష్కారాల నెట్‌వర్క్ భాగస్వామ్యంతో ప్రచురించింది. ప్రతి సంవత్సరం మార్చి 20న అంతర్జాతీయ హ్యాపినెస్ డే సందర్భంగా జారీ అయ్యే నివేదికలో 140కి పైగా దేశాలలో నిర్వహించి సర్వే డేటా ఆధారంగా ర్యాంకులను కేటాయించారు.
సౌదీ అరేబియా.. యునైటెడ్ స్టేట్స్ (23వ స్థానం), కెనడా (25వ స్థానం), యునైటెడ్ కింగ్‌డమ్ (29వ స్థానం) వంటి అనేక ప్రధాన ఆర్థిక వ్యవస్థల కంటే ముందు స్థానంలో నిలిచింది. ఫిన్లాండ్ వరుసగా తొమ్మిదవ సంవత్సరం కూడా ర్యాంకింగ్‌లలో అగ్రస్థానంలో నిలవగా, దాని తర్వాత ఐస్‌లాండ్ మరియు డెన్మార్క్ నిలిచాయి.
ఈ నివేదిక తలసరి జీడీపీ, సోషల్ సఫోర్ట్, ఆరోగ్యకరమైన ఆయుర్దాయం, స్వేచ్ఛాయుత జీవితం, జెనెరోసిటీ మరియు అవినీతిపై అభిప్రాయాలు వంటి కీలక సూచికల ఆధారంగా జీవన సంతృప్తిని మూల్యాంకనం చేస్తారు.
ప్రపంచ సంతోష నివేదికను ఒక కీలక కొలమానంగా ఉపయోగించుకునే సౌదీ అరేబియా జీవన నాణ్యత కార్యక్రమం ప్రభావాన్ని ఈ ఫలితాలు స్పష్టం చేస్తున్నాయని పేర్కొన్నారు.జీవన నాణ్యత రంగాలు సౌదీ అరేబియా జీడీపీకి $20.5 బిలియన్లకు పైగా దోహదపడ్డాయి. $5.8 బిలియన్లకు పైగా ప్రభుత్వేతర పెట్టుబడులను ఆకర్షించాయని, చముయేతర ఎగుమతులను $5.6 బిలియన్లకు పైగా పెంచాయని నివేదికలో వెల్లడించారు.
తాజా వార్తలు
- మహనీయుల పోరాటాలు యువతకు స్ఫూర్తిదాయకం: ఉపరాష్ట్రపతి
- UAEU Concludes Participation in the Arab Media Summit 2026
- దుబాయ్‌లో కొత్త 80 కి.మీ రోడ్డు కారిడార్.. ట్రాఫిక్ రద్దీకి చెక్
- ఖతార్‌లో చికెన్, కొన్ని కూరగాయలపై కస్టమ్స్ డ్యూటీ పెంపు..!!
- బహ్రెయిన్‌లో తెలియని వాట్సాప్ ఛారిటీకి డబ్బులు పంపొద్దు..!!
- కువైట్ హవల్లీలో భద్రతా తనిఖీలు..122 మంది అరెస్ట్..!!
- JEE మెయిన్ 2027 షెడ్యూల్ విడుదల
- ఒమన్–బోట్స్వానా మధ్య కీలక ఒప్పందాలు..!!
- సౌదీ పోర్టుల్లో భారీగా పెరిగిన కంటైనర్ రవాణా..!!
- 14% వృద్ధి నమోదు చేసిన యూఏఈ బీమా రంగం..!!







