హోంల్యాండ్ సెక్యూరిటీ చీఫ్‌గా అపజయం ఎరుగని ఎంఎంఏ ఫైటర్
- March 25, 2026
అమెరికా హోంల్యాండ్ సెక్యూరిటీ (DHS) కొత్త కార్యదర్శిగా సెనేటర్ మార్క్వేన్ ముల్లిన్తో అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రమాణ స్వీకారం చేయించారు. ముల్లిన్‌ను "గొప్ప అమెరికా దేశభక్తుడు" అని అభివర్ణించిన ట్రంప్ అక్రమ వలసలు, సరిహద్దు భద్రతపై మరింత కఠినమైన చర్యలు ఉంటాయని స్పష్టం చేశారు. ఈ నియామకంపై తనకు పూర్తి విశ్వాసం ఉందని ట్రంప్ అన్నారు.
వైట్‌హౌస్‌లో మంగళవారం జరిగిన ఈ కార్యక్రమంలో ట్రంప్ మాట్లాడుతూ.. సరిహద్దు భద్రత, వలసదారుల నేరాలను అరికట్టడంలో ముల్లిన్ తన ప్రభుత్వానికి కీలక భాగస్వామిగా ఉన్నారని కొనియాడారు. ఒక్లహామా నుంచి 13 ఏళ్లుగా కాంగ్రెస్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న ముల్లిన్కు ప్రత్యేక గుర్తింపు ఉంది. సెనేట్‌లో ఏకైక స్థానిక అమెరికన్‌గా, క్యాబినెట్లో పనిచేయనున్న తొలి చెరోకీ నేషన్ సభ్యుడిగా ఆయన చరిత్ర సృష్టించారు. రాజకీయాల్లోకి రాకముందు వ్యాపారవేత్తగా రాణించిన ముల్లిన్, మిక్స్డ్ మార్షల్ ఆర్ట్స్ (MMA)లో అపజయం ఎరుగని ఫైటర్‌గా కూడా ప్రసిద్ధి చెందారు.
ఈ కార్యక్రమాన్ని వేదికగా చేసుకుని ట్రంప్ తన రాజకీయ ప్రత్యర్థులపై తీవ్ర విమర్శలు చేశారు. ప్రతిపక్ష డెమోక్రాట్లు డీహెచ్ఎస్కు నిధులు రాకుండా అడ్డుకున్నారని ఆరోపించారు. గత ప్రభుత్వాల విధానాల వల్ల సుమారు 2.5 కోట్ల మంది దేశంలోకి చొరబడ్డారని, వారి వల్లే నేరాలు పెరిగాయని అన్నారు. కార్యదర్శిగా ముల్లిన్ నేతృత్వంలో అక్రమ వలసదారులైన నేరస్థులను దేశం నుంచి బహిష్కరించే ప్రక్రియను వేగవంతం చేస్తామని ట్రంప్ పేర్కొన్నారు.
తాజా వార్తలు
- ఖతార్‌లో క్లాస్జెన్ ఐ డ్రాప్స్ రీకాల్..!!
- బహ్రెయిన్ పాఠశాలల్లో పర్యావరణ పాఠాలు..!!
- యూఏఈలో వాహనాల కొనుగోలుపై కొత్త నిబంధనలు..!!
- భారత్ నుంచి పేపర్ దిగుమతులపై GCC యాంటీ డంపింగ్ విచారణ..!!
- ఒమన్‌లో ‘ముసందమ్ వింటర్ 2026-2027’కు శ్రీకారం..!!
- కువైట్‌లో ప్రాపర్టీ యజమానులకు హోంశాఖ హెచ్చరిక..!!
- సౌదీ, ఫ్రాన్స్ రక్షణ మంత్రుల మధ్య కీలక చర్చలు
- టాలెంట్ డెవలప్మెంట్లో దుబాయ్ పోలీసులకు మిడిల్ ఈస్ట్ ఎక్సలెన్స్ అవార్డు
- 2027 నుంచి దుబాయ్‌లో డెలివరీ బైక్‌లకు స్మార్ట్ మానిటరింగ్ తప్పనిసరి
- ఈడీ మెరుపు దాడులు..రూ.1,500 కోట్ల మనీలాండరింగ్ గుట్టురట్టు







