యురేనియం నిల్వల గురించి లోక్ సభలో ప్రశ్నించిన ఎంపీ బాలశౌరి
- March 25, 2026
న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్‌లోని కడప జిల్లా తుమ్మలపల్లె ప్రాంతంలోని యురేనియం నిల్వల పై లోక్‌సభలో ఎంపీ బాలశౌరి ప్రశ్నించారు. తాజా పార్లమెంట్ సమావేశాల్లో ఆయన ఈ అంశం పై ప్రధానమంత్రిని వివరణ ఇవ్వాలని కోరారు.
ఎంపీ బాలశౌరి తన ప్రశ్నల్లో తుమ్మలపల్లెలో అదనంగా 4,400 టన్నుల యురేనియం నిల్వలు లభించాయా?లభించిన యురేనియం నాణ్యత (గ్రేడ్) 0.4 శాతంగా ఉందా? అలాగే అన్వేషణ ఎంత లోతు వరకు జరిగింది, నిల్వల వెలికితీత ఎప్పుడు ప్రారంభమవుతుందనే విషయాలను అడిగారు.
ఈ ప్రశ్నలకు సిబ్బంది, ప్రజా ఫిర్యాదులు మరియు పెన్షన్ల శాఖల సహాయ మంత్రి, అలాగే ప్రధానమంత్రి కార్యాలయ సహాయ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ వ్రాతపూర్వక సమాధానం ఇచ్చారు.
అణుశక్తి శాఖకు చెందిన అణు ఖనిజాల అన్వేషణ మరియు పరిశోధన డైరెక్టరేట్ (AMD) 2024-25, 2025-26 సంవత్సరాల్లో తుమ్మలపల్లె యురేనియం నిక్షేపాల్లో సుమారు 4,400 టన్నుల ఇన్-సిటు యురేనియం ఆక్సైడ్ వనరును గుర్తించినట్లు మంత్రి తెలిపారు.
అయితే యురేనియం సగటు నాణ్యత 0.4 శాతం ఉందన్న విషయాన్ని మంత్రి ఖండించారు.
యురేనియం వెలికితీతపై మాట్లాడుతూ, ‘అణు ఖనిజాల రాయితీ నియమాలు, 2016’ ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం గనుల లీజును మంజూరు చేసిన తర్వాతే తవ్వకాలు ప్రారంభమవుతాయని స్పష్టం చేశారు.
ఈ ప్రకటనతో తుమ్మలపల్లె యురేనియం నిల్వల అభివృద్ధి పై మరింత స్పష్టత ఏర్పడింది.
తాజా వార్తలు
- యూఏఈలో అక్టోబర్ నుంచి అధిక వర్షాలు?
- సౌదీ అరేబియాలో వడ్డీ రేట్లు పెంపు..!!
- హోర్ముజ్ జలసంధి పరిస్థితిపై ఒమన్ కీలక ప్రకటన..!!
- కువైట్‌లో డ్రోన్లపై మరోసారి హెచ్చరిక జారీ..!!
- బహ్రెయిన్‌లో ఆలీ వాక్‌వేకు కొత్త రూపు..!!
- ఖతార్‌లో కీలక వడ్డీ రేట్లు పెంపు..!!
- గ్లోబల్ విలేజ్ సీజన్ 31 VIP ప్యాక్స్ విక్రయ తేదీలు వెల్లడి
- TGSRTC సంచలన నిర్ణయం..
- ఎయిర్ ఇండియా, ఉజ్బెకిస్థాన్ ఎయిర్‌వేస్‌తో ఫ్లైడుబాయ్ కొత్త భాగస్వామ్యాలు
- జనవరి 14 నుంచి ఉమెన్స్ ప్రీమియర్ లీగ్(WPL) ఐదో సీజన్.. !







