అల్ జబల్ అల్ అఖ్దర్, రుస్తాక్ విలాయత్‌లలో భారీ వర్షాలు..!!
- March 26, 2026
మస్కట్ః అల్ జబల్ అల్ అఖ్దర్, అదఖిలియా గవర్నరేట్‌లోని అల్ జబల్ అల్ అఖ్దర్ విలాయత్‌లో భారీ వర్షాలు కురిశాయి. వర్షాలతోపాటు బలమైన గాలులు మరియు వడగళ్లు కూడా పడ్డాయి. దీంతో సైక్, వాడి కతమ్, అల్ మనాఖిర్, హైల్ అల్ ముస్బాత్, అల్ షురైజా, వాడి బని హబీబ్, అల్ సవ్జరా, అల్ రూస్ మరియు హైల్ అల్ యమన్ వంటి అనేక వాడీలు (నదీ లోయలు) పొంగి ప్రవహించాయి. అంతేకాకుండా, వాడీలు మరియు నీటి ప్రవాహాలు ఉధృతంగా ప్రవహించడం వల్ల అనేక భూగర్భ జలాల పునరుద్ధరణ ప్రాజెక్టులు (recharge dams) నిండుకుండలా మారాయని అధికారులు తెలిపారు.
దక్షిణ అల్ బతినా గవర్నరేట్‌లోని అరుస్తాక్ విలాయత్‌లో భారీ నుండి అత్యంత భారీ వర్షాలు కురిశాయి. విలాయత్ కేంద్రంతోపాటు బని గఫిర్, బని హని, అల్ సహ్తాన్ మరియు బని అవ్ఫ్ వాడీల ప్రాంతాలపై ఎక్కువగా కేంద్రీకృతమై ఉందని, దీనివల్ల ఆయా ప్రాంతాలలోని వాడీలు మరియు నీటి ప్రవాహాలు ఉధృతంగా ప్రవహిస్తున్నాయని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు.
తాజా వార్తలు
- సౌదీ, ఫ్రాన్స్ రక్షణ మంత్రుల మధ్య కీలక చర్చలు
- టాలెంట్ డెవలప్మెంట్లో దుబాయ్ పోలీసులకు మిడిల్ ఈస్ట్ ఎక్సలెన్స్ అవార్డు
- 2027 నుంచి దుబాయ్‌లో డెలివరీ బైక్‌లకు స్మార్ట్ మానిటరింగ్ తప్పనిసరి
- ఈడీ మెరుపు దాడులు..రూ.1,500 కోట్ల మనీలాండరింగ్ గుట్టురట్టు
- డాలస్ లో వైభంవగా కొసరాజు సాహిత్యావిష్కరణ
- భారత్–యూఏఈ ఆవిష్కరణ రంగంలో కొత్త అడుగు..
- బాంబు బెదిరింపుల వేళ.. బుల్లెట్‌ప్రూఫ్ గ్లాస్‌తో కనిపించిన అమితాబ్
- హైదరాబాద్‌లో అమిత్ షా పాదయాత్ర ప్రారంభం
- బహ్రెయిన్‌లో ప్రవాసులకు కొత్త హెల్త్ ఇన్సూరెన్స్ నిబంధనలు..!!
- 2027 నుంచి యూఏఈలో కొత్త ట్రాఫిక్ రూల్స్..!!







