ప్రాపర్టీ మార్కెట్ పతనంపై ఫేక్ న్యూస్ ను ఖండించిన దుబాయ్..!!
- March 26, 2026
యూఏఈః ‘దుబాయ్ నుండి సామూహిక తరలింపు’, ‘దుబాయ్ ఇక సురక్షితం కాదు’, ‘విమానాశ్రయాలు మూతపడ్డాయి’, ‘ నిత్యవసరాల షెల్ఫ్‌లు ఖాళీగా ఉన్నాయి’ వంటి ఆన్‌లైన్‌లో ప్రచారంలో ఉన్న ఆందోళనకరమైన వార్తలన్ని ఫేక్ అని దుబాయ్ అధికారులు తెలిపారు. ఈ మేరకు బాయ్ ప్రభుత్వ మీడియా కార్యాలయం ఒక ప్రకటన విడుదల చేసింది. ఫేక్ వార్తలపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు వీలుగా ఓ వీడియోను షేర్ చేసింది.
"వదంతులను నమ్మవద్దు, వాస్తవాలపై దృష్టి పెట్టండి" అని ఆ కార్యాలయం వీడియోతో పాటు విడుదల చేసిన ఒక ప్రకటనలో పేర్కొంది. "దుబాయ్ యథావిధిగా పనిచేస్తోంది. నకిలీ వార్తలతో తప్పుదోవ పట్టకండి. సమాచారం తెలుసుకోండి మరియు షేర్ చేసే ముందు ధృవీకరించుకోండి." పేర్కొంది.
బ్యాంకులు పెట్టుబడిదారుల నిధులను స్తంభింపజేస్తున్నాయని, ఆస్తి మార్కెట్ కుప్పకూలుతోందని, సంపన్న నివాసితులు, హెడ్జ్ ఫండ్‌లు ఎమిరేట్ నుండి పారిపోతున్నారని వంటి వైరల్ తరహా టైటిల్స్ ను ఒకచోట చేర్చి, అవి ఫేక్ వార్తలు అని వీడియోలో తేల్చిచెప్పింది.
ప్రాంతీయ ఉద్రిక్తతలు అధికంగా ఉన్న సమయాల్లో, ధృవీకరించని సమాచారాన్ని వ్యాప్తి చెందకుండా హెచ్చరించింది. తాజా సమాచారం కోసం అధికారిక మూలాలపై మాత్రమే ఆధారపడాలని అధికారులు నివాసితులకు మరియు సోషల్ మీడియా వినియోగదారులకు విజ్ఞప్తి చేశారు.
తాజా వార్తలు
- బహ్రెయిన్లో గడువు ముగిసిన ఆహార పదార్థాల విక్రయాలపై కొరడా..!!
- ఖతార్లో ఆహార భద్రతకు పెద్దపీట..!!
- షార్క్ తాత్కాలిక చేపల మార్కెట్ ప్రారంభం..!!
- యూఏఈలో భారీ వర్షాలు.. అల్ ఐన్లో జలమయమైన రహదారులు..!!
- హౌతీ దాడులను ఖండించిన ఐరాస భద్రతా మండలి.. సౌదీ అరేబియా హర్షం..!!
- ఫుజైరా తీరంలో భూకంపం.. తీవ్రత 1.6గా నమోదు..!!
- ముసందమ్ తీరంలో ప్రమాదకర కంటైనర్లు.. ఒమన్ హెచ్చరిక..!!
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా







