'బ్యాడ్ బాయ్ కార్తిక్' జీ స్టూడియోస్ ద్వారా ఏప్రిల్ 17న వరల్డ్ వైడ్ గ్రాండ్ రిలీజ్
- March 27, 2026
హీరో నాగ శౌర్య అవుట్ అండ్ అవుట్ యాక్షన్ ఎంటర్టైనర్ 'బ్యాడ్ బాయ్ కార్తిక్'తో అలరించడానికి సిద్ధంగా ఉన్నారు. శ్రీ వైష్ణవి ఫిల్మ్స్ బ్యానర్‌పై శ్రీనివాస రావు చింతలపూడి నిర్మాణంలో, నూతన దర్శకుడు రామ్ దేశిన (రమేష్) దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందుతోంది. ఈ సినిమా మ్యూజిక్ ప్రమోషన్స్ ఇప్పటికే భారీ బజ్‌ను సృష్టించాయి. విడుదలైన ప్రతి పాట చార్ట్‌బస్టర్‌గా నిలిచింది. హై-వోల్టేజ్ సన్నివేశాలు మాస్ యాటిట్యూడ్‌తో నిండిన ఈ సినిమా టీజర్, చిత్రంపై ఉన్న అంచనాలను మరింత పెంచింది.
వేసవిలో విడుదలయ్యే భారీ చిత్రాలలో ఒకటిగా 'బ్యాడ్ బాయ్ కార్తిక్' ఏప్రిల్ 17న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుందని చిత్ర నిర్మాతలు అధికారికంగా ప్రకటించారు. రిలీజ్ డేట్ పోస్టర్ లో ఫైర్ బ్యాక్ డ్రాప్, ఒక చేతిలో ఆయుధం పట్టుకుని, మరో పిడికిలి బిగించి నాగ శౌర్య కనిపించడం, ఆయన వెనుక, పండుగ ఊరేగింపులలో కనిపించే భారీ అమ్మవారి విగ్రహం దర్శనమివ్వడం క్యురియాసిటీని పెంచింది.
'బ్యాడ్ బాయ్ కార్తిక్' సినిమా థియేట్రికల్, నాన్-థియేట్రికల్ హక్కులనుజీ స్టూడియోస్ భారీ ధరకు సొంతం చేసుకుంది. ప్రస్తుతం సినిమాల డీల్స్ కష్టంగా మారిన ఈ సమయంలో ఈ సినిమా కోసం ఇంత త్వరగా డీల్ క్లోజ్ కావడం, సినిమా కంటెంట్‌పై ఉన్న బలమైన నమ్మకాన్ని చూపిస్తోంది. జీ స్టూడియోస్ తో ఈ భాగస్వామ్యం సినిమా క్రెడిబిలిటీని పెంచడమే కాకుండా, రిలీజ్‌కు ముందే మంచి బజ్‌ను కూడా తీసుకువచ్చింది.
ఈ సినిమాలో నాగ శౌర్య సరసన విధి కథానాయికగా నటిస్తుండగా, శ్రీదేవి విజయకుమార్ ఆయన సోదరి పాత్రలో కనిపించనున్నారు. సముద్రఖని, నరేష్ వి.కె. కీలక పాత్రల్లో నటిస్తున్నారు.
ఈ చిత్రానికి రసూల్ ఎల్లోర్ సినిమాటోగ్రఫీని అందిస్తుండగా, హారిస్ జైరాజ్ సంగీతం సమకూర్చారు. కోటగిరి వెంకటేశ్వర రావు ఎడిటింగ్, రామంజనేయులు ఆర్ట్ డైరెక్టర్.
నటీనటులు: నాగ శౌర్య, విధి, సముద్రఖని, నరేష్ VK, సాయికుమార్, మైమ్ గోపి, శ్రీదేవి విజయ్ కుమార్, వెన్నెల కిషోర్, బ్రహ్మాజీ, పృథ్వీ, అజయ్, ప్రియ, నెల్లూరు సుదర్శన్, కృష్ణుడు, చమక్ చంద్ర, శివన్నారాయణ
సాంకేతిక సిబ్బంది:
రచన, దర్శకత్వం: రామ్ దేశిన (రమేష్)
నిర్మాత: శ్రీనివాసరావు చింతలపూడి
బ్యానర్: శ్రీ వైష్ణవి ఫిల్మ్స్
DOP: రసూల్ ఎల్లోర్
సంగీతం: హారిస్ జైరాజ్
ఆర్ట్: రామాంజనేయులు
ఎడిటర్: కోటగిరి వెంకటేశ్వరరావు
ఫైట్స్- సుప్రీమ్ సుందర్, పృధ్వి
కొరియోగ్రాఫర్లు: రాజు సుందరం, శోబి మాస్టర్, విజయ్ పొలంకి, శిరీష్
సాహిత్యం: చంద్రబోస్, రామజోగయ్య శాస్త్రి, కాసర్ల శ్యామ్, కృష్ణకాంత్
ఎగ్జిక్యూటివ్ నిర్మాత: శంకర్
PRO: వంశీ-శేఖర్
తాజా వార్తలు
- భక్తులకు TTD కీలక అలర్ట్..
- రాష్ట్రాల సీఎంలతో ప్రధాని మోదీ కీలక సమావేశం..
- వైజాగ్ లో ఇనార్బిట్ మాల్ ప్రారంభం..
- రేపు అమర జ్యోతి ఉమేష్ చంద్ర—60వ జయంతి
- రామ్ చరణ్ బర్త్‌డేకు అర్థవంతమైన కానుక ఇచ్చిన చిరంజీవి
- ఉక్రెయిన్–సౌదీ అరేబియా మధ్య రక్షణ సహకార ఒప్పందం
- ఏప్రిల్ 25న కొత్త పార్టీ పేరు ప్రకటించనున్న కవిత
- సివిలియన్ రక్షణ పై ఫోకస్..!!
- ప్రపంచవ్యాప్తంగా మూడో స్థానంలో జెద్దా ఎయిర్పోర్ట్..!!
- భారీ వర్షాలు..నీట మునిగిన ఇళ్లు, కార్లు..!!









