భక్తులకు TTD కీలక అలర్ట్..
- March 27, 2026
తిరుమల: తిరుమల భక్తులకు టీటీడీ కీలక అలర్ట్ జారీ చేసింది. తాజాగా ఆన్‌లైన్ కరెంట్ బుకింగ్ విధానంలో టీటీడీ పలు కీలక మార్పులు చేసింది. శుక్రవారం అంటే మార్చి 27 నుంచే ఈ కొత్త రూల్స్ ని టీటీడీ అమల్లోకి తీసుకువచ్చింది. శ్రీవాణి ట్రస్టుకు రూ.10 వేలు విరాళం ఇచ్చిన తర్వాత వీఐనీ బ్రేక్ దర్శనం టికెట్లు బుక్ చేసుకుందామని ప్రయత్నిస్తుండగానే.. ఆ టికెట్లు అయిపోయినట్లు చూపిస్తోంది. ఈ అంశం పై గత కొన్ని రోజులుగా భక్తులు టీడీటీకి ఫిర్యాదు చేస్తున్నారు. ఈ క్రమంలో టీటీడీ ఈ సమస్యల పరిష్కారానికి ముందుకు వచ్చింది.
ఇప్పటి వరకు భక్తులు శ్రీవాణి ట్రస్ట్ కి రూ.10 వేలు విరాళం ఇచ్చాక రూ.500 అదనంగా చెల్లించి వీఐపీ బ్రేక్ దర్శనం టికెట్ బుక్ చేసుకోవాల్సి ఉంది. అయితే విరాళం ఇచ్చి దర్శనం టికెట్ కు రూ.500 చెల్లించేలోపే టికెట్లు అయిపోతున్నాయి. దీంతో విరాళం ఇచ్చిన భక్తులు వీఐపీ దర్శన టికెట్లు బుక్ చేసుకోలేక ఇబ్బంది పడుతున్నారు. ఈ సమస్య పై స్పందించిన టీటీడీ టికెట్ బుకింగ్ విషయంలో అనేక మార్పులకు శ్రీకారం చుట్టింది.
ఇక నుంచి శ్రీవాణి ట్రస్ట్‌కు విరాళం ఇచ్చి.. ఆ తర్వాత రూ.500 చెల్లించి వీఐపీ దర్శనం టికెట్ తీసుకోవాలని భావించేవారు.. ఇక పై మొత్తం అంటే విరాళం రూ.10 వేలు, టికెట్ కోసం రూ.500 కలిపి మొత్తం ఒకేసారి రూ.10,500 చెల్లించవచ్చు. ఈ కొత్త విధానం వల్ల ట్రస్టుకు విరాళం ఇచ్చిన భక్తులకు వీఐపీ దర్శనం టికెట్లు వెంటనే బుక్ అవుతాయి. టికెట్ కోసం మరోసారి ప్రత్యేకంగా చెల్లించాల్సిన అవసరం లేదు. ఈ మార్పులను అమలు చేసే బాధ్యతను టీటీడీ యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు అప్పగించింది. దీంతో ఇక పై భక్తులు డెబిట్, యూపీఐ, క్రెడిట్ కార్డు, నెట్ బ్యాంకింగ్ ల ద్వారా ఒకేసారి చెల్లింపులు చేయవచ్చు.
ఈ సంవత్సరం జనవరి నుంచి టీటీడీ.. శ్రీవాణి టికెట్లను ఆన్‌లైన్‌లో జారీ చేస్తోంది. ప్రతీ రోజు 800 టికెట్లను మాత్రమే జారీ చేస్తోంది. ప్రతి రోజు ఉదయం 9 గంటలకు శ్రీవాణి టికెట్లను ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంచుతారు. కేవలం 1+3 భక్తులకు మాత్రమే బుక్ చేసుకోవడానికి అనుమతి ఉంటుంది. ఐడీ పై ఒకసారి టికెట్ బుక్ చేసుకుంటే.. మళ్లీ వారం రోజుల వరకు ఆ ఐడీ పై టికెట్ బుక్ చేసుకోలేరు.
తాజా వార్తలు
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్‌లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్‌ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్‌ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్‌లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్‌లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!







