రాష్ట్రాల సీఎంలతో ప్రధాని మోదీ కీలక సమావేశం..
- March 27, 2026
న్యూ ఢిల్లీ: అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ప్రధాని మోదీ సమావేశం కాబోతున్నారు. పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో అలర్ట్ అయిన కేంద్ర ప్రభుత్వం అన్ని రాష్ట్రాల సీఎంలతో ప్రధాని మోదీ సాయంత్రం 6.30 గంటలకు వర్చువల్ గా మీట్ కాబోతున్నారు. పశ్చిమాసియాలో పరిస్థితులు, భారత్ అనుసరిస్తున్న విధానాలను వివరించబోతున్నట్లుగా సమాచారం. అదే విధంగా ఆయా రాష్ట్రాల సన్నద్ధత, సహకారంపై చర్చించబోతున్నట్లుగా తెలుస్తోంది.
ఇటీవల పార్లమెంట్ ఉభయ సభల్లో మాట్లాడిన ప్రధాని మోదీ యుద్ధం వల్ల ప్రపంచవ్యాప్తంగా నెలకొన్ని సంక్లిష్ట పరిస్థితులు దీర్ఘకాలం పాటు కొనసాగే అవకాశాలు ఉన్నాయని, ఇది పరీక్షా సమయం అని తెలిపారు. సంక్షోభం నుంచి బయటపడటంలో రాష్ట్రాలన్నీ కేంద్రంతో కలిసి టీమిండియాలా పని చేయాలంటూ పిలుపునిచ్చారు మోదీ. ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు ప్రజలంతా సిద్ధమై ఉండాలని పిలుపునిచ్చారు. ఈ క్రమంలోనే అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ప్రధాని సమావేశానికి సిద్ధమవడం ప్రాధాన్యత సంతరించుకుంది.
ఇక వచ్చే నెలలో ఎన్నికలు జరగబోతున్న రాష్ట్రాల ముఖ్యమంత్రులు మాత్రం ఈ సమావేశానికి దూరంగా ఉండబోతున్నట్లు తెలుస్తోంది.ఆయా రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులతో క్యాబినెట్ సెక్రటరీ ప్రత్యేకంగా సమావేశం కాబోతున్నారు. ప్రధాని, సీఎంల వీడియో కాన్ఫరెన్స్ లో తీసుకున్న వివరాలు సీఎస్ లకు వెల్లడించి ఆయా రాష్ట్రాల్లో అమలు చేసేలా క్యాబినెట్ సెక్రటరీ సూచించబోతున్నట్లుగా సమాచారం.
తాజా వార్తలు
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!







