NRI టీడీపీ గల్ఫ్ కౌన్సిల్ ఆధ్వర్యంలో టీడీపీ 44వ ఘనంగా ఆవిర్భావ దినోత్సవ వేడుకలు
- March 30, 2026
ఎన్ఆర్ఐ టీడీపీ గల్ఫ్ కౌన్సిల్ ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ 44వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. గల్ఫ్ దేశాల్లోని తెలుగు దేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు భారీ సంఖ్యలో పాల్గొని వేడుకలను విజయవంతం చేశారు. తెలుగు వారి ఆత్మగౌరవానికి ప్రతీకగా స్వర్గీయ నందమూరి తారక రామారావు 1982 మార్చి 29న స్థాపించిన తెలుగుదేశం పార్టీ నాలుగు దశాబ్దాలుగా ప్రజా ఆశయాలకు అండగా నిలుస్తోందని నాయకులు పేర్కొన్నారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఆంధ్రప్రదేశ్ తెలుగు దేశం పార్టీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ రావు, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సలహాదారు మరియు ఏపీఎన్ఆర్టీఎస్ అధ్యక్షుడు రవి కుమార్ పి.వేమూరు, ఏపీ బ్రాహ్మణ వెల్ఫేర్ కార్పొరేషన్ చైర్మన్ కె.బుచ్చి రామ్ ప్రసాద్ హాజరై పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. పార్టీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ రావు వర్చువల్‌గా కార్యక్రమంలో పాల్గొని గల్ఫ్‌లోని ఎన్ఆర్ఐ టీడీపీ కార్యకర్తలతో పరస్పర సంభాషణ జరిపారు.
ఎన్ఆర్ఐ టీడీపీ గల్ఫ్ కౌన్సిల్ అధ్యక్షుడు రావి రాధాకృష్ణ ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకల్లో ఏపీ ఎన్ఆర్టీఎస్ డైరెక్టర్ నాగేంద్ర బాబు అక్కిలి, ఎన్ఆర్ఐ టీడీపీ సెల్ సమన్వయకర్త రాజశేఖర్ చప్పిడితో పాటు సౌదీ అరేబియా, బహ్రెయిన్, కువైట్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, ఖతార్, ఒమాన్ దేశాలకు చెందిన పార్టీ ప్రతినిధులు, కార్యకర్తలు ఉత్సాహంగా పాల్గొన్నారు.
సౌదీ అరేబియా నుంచి ఖాలిద్ సైఫుల్లా, సరధి నాయుడు వడలమూడి, చంద్రశేఖర్, శ్రీనివాస్ కొగంటి తదితరులు పాల్గొనగా, బహ్రెయిన్ నుంచి హరి బాబు, రఘునాథ్ బాబు, కువైట్ నుంచి వెంకట్ కొడూరి, సుధాకర్ కుదరవల్లి, ఈశ్వర్ నాయుడు, ఖతార్ నుంచి రమణ గొట్టిపాటి, నరేష్ మద్దిపాటి, యూఏఈ నుంచి విశ్వేశ్వరరావు మోతుకూరి, తులసి కుమార్ ముక్కు, రాజా రవి, ప్రసాదు దారపనేని, సునీల్ బోయపాటి తదితరులు హాజరయ్యారు. ఒమాన్ నుంచి సత్య శ్రీధర్, రాఘవేంద్ర, అనిల్ నాగిడి పాల్గొన్నారు.
ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ, “కార్యకర్తలే పార్టీకి బలం…అభివృద్ధే పార్టీ పథం” అనే నినాదంతో తెలుగుదేశం పార్టీ ప్రజల మనసుల్లో ప్రత్యేక స్థానం సంపాదించుకుందని అన్నారు. బడుగు, బలహీన వర్గాలకు అండగా నిలుస్తూ సంక్షేమ రాజ్య నిర్మాణానికి టీడీపీ కట్టుబడి పనిచేస్తోందని చెప్పారు.
అలాగే, కోటికి పైగా సభ్యత్వంతో దేశ రాజకీయాల్లో ప్రత్యేక గుర్తింపు పొందిన తెలుగుదేశం పార్టీ, నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో మరింత బలోపేతంగా ముందుకు సాగుతోందని పేర్కొన్నారు. అభివృద్ధి, సంక్షేమం, పరిపాలనా సంస్కరణల సమన్వయంతో ప్రజలకు మెరుగైన పాలన అందించడమే పార్టీ లక్ష్యమని స్పష్టం చేశారు.
భవిష్యత్ తరాల సంక్షేమం, తెలుగు ప్రజల అభ్యున్నతే పార్టీ ధ్యేయమని, ఆ లక్ష్య సాధనలో ఎన్ఆర్ఐ టీడీపీ గల్ఫ్ కౌన్సిల్ ఎల్లప్పుడూ ముందుంటుందని నాయకులు తెలిపారు. ఈ వేడుకలు గల్ఫ్ దేశాల్లోని తెలుగు దేశం పార్టీ శ్రేణుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపాయి.



తాజా వార్తలు
- డబ్బులు తీసుకుని వీసాలు ఇప్పిస్తామంటూ మోసాలు.. అప్రమత్తంగా ఉండాలని దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- ఇరాన్ దాడులతో కువైట్‌లో చెలరేగిన మంటలు అదుపులోకి.. పలువురికి గాయాలు
- 72 వ జాతీయ చలనచిత్ర పురస్కారాలు ప్రకటింపు..
- FICCI FLO ప్రధాన కార్యాలయానికి వెయ్యి గజాల స్థలం కేటాయింపు: సీఎం రేవంత్
- అమెరికా పై ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ తీవ్ర విమర్శలు..
- కువైట్, బహ్రెయిన్, జోర్డాన్‌లపై ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన GCC
- హైదరాబాద్‌లో ‘ఆండ్ పర్పస్ ఫోరమ్ 2026’ సదస్సు
- దుబాయ్ పేలుళ్లపై తప్పుడు కథనం ప్రచురణ.. జర్నలిస్టు, బృందానికి యూఏఈ సమన్లు
- ప్రజాకవి అందె సీఎం రేవంత్ ఘన నివాళులు..
- బ్రెయిన్ ఇంజ్యూరీ నుంచి జాతీయ సేవలోకి..ఓ టీన్ స్ఫూర్తి ప్రయాణం..!!







