రియాద్‌లో హౌజ్ హోల్డ్ డెమోగ్రాఫిక్ సర్వే ప్రారంభం..!!
- March 30, 2026
రియాద్: సౌదీ అరేబియా రాజధాని నగరం రియాద్ లోని సౌదీ మరియు సౌదీయేతర నివాసితులను కవర్ చేసేలా గృహ జనాభా సర్వే కార్యక్రమం ప్రారంభమైనట్లు రియాద్ నగర రాయల్ కమిషన్ (RCRC) ప్రకటించింది. మే 10 వరకు కొనసాగే ఈ కార్యక్రమాన్ని, జనరల్ అథారిటీ ఫర్ స్టాటిస్టిక్స్ (GASTAT) సహకారంతో చేపడుతున్నారు. పట్టణ సమాచార డేటాబేస్‌లను అప్డేట్ చేయడంతోపాటు నగర ప్రణాళిక, అభివృద్ధికి తోడ్పడే నిరంతర ప్రయత్నాలలో ఈ సర్వే ఒక భాగమని పేర్కొన్నది.
జనాభా పెరుగుదలను విశ్లేషించడం, ప్రజా సేవలను మెరుగుపరచడం, జీవన నాణ్యతను పెంచడం, అభివృద్ధి వ్యూహాలకు సమాచారం అందించడానికి, పట్టణ ప్రణాళికకు మద్దతు ఇవ్వడం ఈ సర్వే లక్ష్యమన్నారు. ఈ సర్వే రియాద్ జనాభా సామాజిక, విద్యా, ఆర్థిక వాస్తవాలను విశ్లేషిస్తుందని తెలిపారు.
ఈ సర్వే 217కు పైగా ప్రాంతాలను కవర్ చేస్తుందన్నారు. ఈ సర్వే శాస్త్రీయంగా గణాంక నమూనాను ఉపయోగించి నిర్వహించబడుతుందని తెలిపారు. ఈ సర్వే ఫలితాలు నగరం భవిష్యత్ ప్రణాళికను మెరుగుపరుస్తాయని, 5,960 చదరపు కిలోమీటర్ల అభివృద్ధి జోన్‌లోని పరిసర ప్రాంతాలు, సేవల స్థాయిలలోని వ్యత్యాసాలను గుర్తించడంలో సహాయపడతాయని కమిషన్ తెలిపింది.
సర్వేలో సేకరించిన డేటా గోప్యత చట్టాల ప్రకారం సురక్షితంగా ఉంటుందని, సౌదీ మరియు సౌదీయేతర కుటుంబాలు తమ సహకారాన్ని అందించాలని కమిషన్ పిలుపునిచ్చింది. అలాగే రాజధాని నగరంలో సేవలను అభివృద్ధి చేయడం మరియు జీవన నాణ్యతను మెరుగుపరచడానికి సంబంధించిన నిర్ణయాలకు సేకరించే డేటా మద్దతు ఇస్తుందని వెల్లడించింది.
తాజా వార్తలు
- నమో భారత్ ప్రయాణికులకు గుడ్‌న్యూస్..
- దీపావళి టపాసుల పై సుప్రీంకోర్టు సంచలన తీర్పు
- కువైట్‌లో జంతువులను బహిరంగ ప్రదేశాల్లో వదిలేస్తే చర్యలు..
- ఒమన్‌లో ఆ ఫ్యాక్టరీపై పర్యావరణ శాఖ చర్యలు..!!
- యూఏఈలో 30, 40 ఏళ్ల వయసులో ఉన్నవారికి గుండె జబ్బుల ముప్పు..!!
- బహ్రెయిన్‌లో దాడులను ప్రోత్సహించే పోస్టులు.. 10 ఏళ్ల జైలుశిక్ష..!!
- ఖతార్‌లో గన్ లైసెన్స్‌దారులకు కీలక హెచ్చరిక..!!
- శాశ్వత శాంతికి రెండు దేశాల పరిష్కారమే మార్గం: సౌదీ
- అక్టోబర్ నెలకు UAE ఇంధన ధరలు ప్రకటింపు
- ప్రముఖ ఆధ్యాత్మికవేత్త కల్కి భగవాన్ మృతి







