ఖతార్‌లో గన్ లైసెన్స్‌దారులకు కీలక హెచ్చరిక..!!

- September 30, 2026 , by Maagulf
ఖతార్‌లో గన్ లైసెన్స్‌దారులకు కీలక హెచ్చరిక..!!

దోహా: గన్ కలిగి ఉండేందుకు లేదా తీసుకెళ్లేందుకు లైసెన్స్‌ పొందిన ఖతార్‌ పౌరులు వాటిని ఇతరులకు అప్పుగా ఇవ్వడం, అప్పగించడం లేదా వారి వద్ద ఉండేందుకు అనుమతించకూడదని ఖతార్‌ అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ (MoI) హెచ్చరించింది.

గన్ లైసెన్స్‌ పూర్తిగా వ్యక్తిగతమైనదని, అది లైసెన్స్‌ పొందిన వ్యక్తికి మాత్రమే చట్టబద్ధంగా వర్తిస్తుందని మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. లైసెన్స్‌ లేని వ్యక్తికి తుపాకీని ఇవ్వడం, అప్పుగా ఇవ్వడం లేదా అతని వద్ద ఉండేందుకు అనుమతించడం 1999 నాటి ఆయుధాలు, మందుగుండు సామగ్రి, పేలుడు పదార్థాల చట్టం నంబర్‌ (14)కు స్పష్టమైన ఉల్లంఘనగా పేర్కొంది.

ఈ నిబంధనలను ఉల్లంఘిస్తే తుపాకీ లైసెన్స్‌దారుతో పాటు లైసెన్స్‌ లేని వ్యక్తి కూడా క్రిమినల్‌ బాధ్యతను ఎదుర్కోవాల్సి ఉంటుంది. నిబంధనల ప్రకారం జైలు శిక్ష, జరిమానా విధించే అవకాశం ఉంది.

అంతేకాకుండా, గన్ లైసెన్స్‌ను రద్దు చేయడంతో పాటు ఆయుధాన్ని స్వాధీనం చేసుకునే అవకాశం ఉంటుంది. లైసెన్స్‌దారుడు భవిష్యత్తులో మళ్లీ ఎలాంటి తుపాకీ లైసెన్స్‌ పొందకుండా నిషేధం విధించవచ్చని MoI తెలిపింది.

సమాజ భద్రత, స్థిరత్వాన్ని కాపాడేందుకు ఈ విషయంలో చట్టాలు, నిబంధనలను ఉల్లంఘించే వారిపై అవసరమైన చట్టపరమైన చర్యలు తీసుకోవడంలో ఏమాత్రం వెనుకాడబోమని అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com